స్కూల్లో టీచర్ అనుమానాస్పద మృతి,విద్యార్థులు కొట్టి చంపారని భార్య ఆరోపణ
స్కూల్లో టీచర్ అనుమానాస్పద మృతి
• విద్యార్థులు కొట్టి చంపారని భార్య ఆరోపణ
రాయచోటిటౌన్, డిసెంబరు: ఓ ఉపా ధ్యాయుడు పాఠశాలలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. గొడవ పడుతున్న విద్యార్థులను మందలించినందుకు ఆయన్ను విద్యార్థులే కొట్టి చంపారని భార్య చెబుతుండగా, అలాంటిదేమీ లేదని ఒక్కసారిగా కుప్పకూలిపోయారని తోటి ఉపాధ్యాయులు చెబుతున్నారు. జిల్లా కేంద్రం రాయచోటిలోని కొత్తపల్లె జడ్పీ ఉర్దూ ఉన్నత పాఠశాలలో బుధవారం ఈ సంఘటన జరిగింది. పోలీసులు, మృతుడి భార్య కథనం మేరకు..
మృతిచెందిన ఉపాధ్యాయుడు ఎజాజ్
రాయచోటి పట్టణంలోని కొత్తపల్లె జడ్పీ ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఎజాజ్(42) ఫిజిక్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. బుధవారం సుమారు 3 గంటల ప్రాంతంలో ఆయన ఒక్కసారిగా పాఠశాలలోనే కుప్పకూలిపోయారు. వెంటనే పాఠశాల సిబ్బంది ఎజాజ్ భార్యకు సమాచారం ఇచ్చి, ఆయనను స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు ఎజాజ్ అప్పటికే చనిపోయారని చెప్పారు. ఎజాజ్ భార్య రహిమూన్ మీడియాతో మాట్లాడుతూ.. తన భర్తకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని, ఐదు పూటలా నమాజు చేస్తాడని, ప్రతిరోజు వాకింగ్కు వెళ్తాడని చెప్పారు. తన భర్త ప్రతిరోజు పాఠశాలకు క్రమం తప్పకుండా వెళ్తాడని, అది భరించలేని కొంతమంది ఉపాధ్యాయులు బయట వాళ్లతో కలిసి తన భర్తను విద్యార్థుల చేత కొట్టించి చంపించారని అనుమానం వ్యక్తం చేశారు. విద్యార్థులు కొట్టిన విషయాన్ని ఉపాధ్యాయులంతా కలిసి బయటికి రానివ్వకుండా తన భర్త గుండెపోటుతో చనిపోయాడని చెబుతున్నారని అన్నారు. ఉన్నతాధికారులు విచారించి తన భర్తను కొట్టి చంపిన విద్యార్థులను, వారిని ప్రోత్సహించిన వారిని, సహకరించిన ఉపాధ్యాయులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై రాయచోటి అర్బన్ సీఐ చంద్రశేఖర్ను 'ఆంధ్రజ్యోతి' వివరణ కోరగా.. ఎజాజ్ పాఠశాలలో కుప్పకూలిపోయారని, ఆయనపై విద్యార్థులు దాడి చేయలేదని హెచ్ఎం చెప్పారని అన్నారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టుగా కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామన్నారు.
Recent Posts
See Allఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...
Comments