top of page

స్కూల్ అటెండెన్స్ యాప్ సోమవారం రాత్రి అప్డేట్ అయ్యింది. ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. కొత్తగా ఏం చేర్చారంటే...

Writer's picture: AP Teachers TVAP Teachers TV

Updated: Aug 6, 2024


ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఉపాధ్యాయుల హాజరు నమోదు చేసి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ యాప్ సోమవారం రాత్రి మళ్ళీ అప్ డేట్ అయింది. ఈ అప్ డేట్ లో ఇప్పటి వరకు ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ మొబైల్ ఫోన్‌లోని అటెండెన్స్ అప్లికేషన్ ద్వారా అప్‌డేట్ చేసిన టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డేటాను ధ్రువీకరించుటకు డీడీఓలకు, అధికారులకుఆ ప్షన్‌ని ఈ అప్ డేట్ లో చేర్చడం జరిగింది. డీడీవోలు తమ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వారి వారి మొబైల్ ఫోన్లలో స్కూల్ అటెండన్స్ యాప్ నందు నమోదు చేసుకున్న వివరాలను ఈ యాప్ లో వారి లాగిన్ నందు ధృవీకరించవలెను (Approve ). ఈ అప్డేట్ ని కింది బటన్ నొక్కి డౌన్లోడ్ /అప్డేట్ చేసుకోవచ్చు .


TIS in ఫేషియల్ యాప్:

Individual లాగిన్ లో సబ్మిట్ చేసిన TIS వివరాలు అటెండెన్స్ యాప్ నందలి Reporting officer యొక్క లాగిన్ లో కి తదుపరి confirmation కొరకు పంపబడినవి.

1. రిపోర్టింగ్ ఆఫీసర్ తన పరిధిలో ని స్టాఫ్ వివరాలకు సంబంధించిన సదరు ఉద్యోగి ఫిర్యాదు ఏమైనా ఉంటే దానిని తగు విచారణ చేసి,తగు ఆధారముతో....కోరిన మార్పులు చేయాలి.

2. ముఖ్యంగా ప్రతి ఉద్యోగి Designation సరిగ్గా ఉందో లేదో‌ తప్పక చూడాలి. మార్పులు అవసరమైతే చేయాలి.

3. ఇప్పుడు Reporting ఆఫీసర్ సమర్పించే వివరాలపైనే సర్దుబాటు జరుగుతుంది కావున Data లో తప్పు లకు సదరు అధికారే బాధ్యులు.

4. Reporting ఆఫిసర్ confirmation తదుపరి డేటా లో ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవు.

5. తేదీలు,ఆప్షనల్స్,మెధడాలజీలు తప్పక వెరిఫై చేయాలి.అవసరమైతే తగు మార్పులు చేయాలి.

6. High school,High school Plus designation లు జాగ్రత్తగా చూసి సబ్మిట్ చేయాలి.వివరాలకు యూజర్ మాన్యువల్ చూడండి.

7. School Asdistant(Physics),School Assistant (Physical Science) మరియు school Assistant (Physical Education) ఓకేలా ఉంటాయి.జాగ్రత్తగా వారి వారి డిజిగ్నేషన్ పదాలు కూడా తప్పు లు దొర్లకుండా చూడాలి.

8. MTS టీచర్స్ అందరూ తప్పక MTSగా నమోదు చేయాలి.SGTగ నమోదు చేయరాదు.

9. వారికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కావున designation తప్పుగ ఉంటే ఆ సమస్య వస్తుంది.

10. తమ పరిధిలో ఉపాధ్యాయులు నమోదు కాకపోయినా, వివరాలు ‌సరిగా సమర్పించకపోయినా ఏదైనా సేవలు అందించేటపుడు తన వివరాలు తప్పుగా ఉన్నాయి ఇప్పుడు మార్చండి అని అడిగినా...సంబంధిత Reporting officer బాధ్యత వహించాలి.


Reporting officers తొందరపడి తప్పులు చేయకండి.


మీరు‌తప్పు సబ్మిట్ చేస్తే ఇహ ఎడిట్ లేదు.



 
 

Recent Posts

See All

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...

Comentarios


bottom of page