top of page
Writer's pictureAP Teachers TV

వర్క్ అడ్జస్ట్ మెంట్ తాజా మార్గదర్శకాలు #teachersworkadjustment

రాష్ట్ర విద్యాశాఖ వర్కడ్జస్ట్మెంట్ సమాచారం


🔯ఈసమావేశంలో ఉపాధ్యాయ సంఘాలు మరియు విద్యాశాఖ కొన్ని విషయాలను చర్చించడం జరిగింది, చర్చించిన విషయాలన్నీ కూడా డ్రాఫ్ట్ రూపంలోసంఘాలకు ఇస్తారు.

🔯ఆ డ్రాఫ్ట్ ను సంఘాలు ఆమోదం తెలిపిన తర్వాత వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

🔯.వర్క్ అడ్జస్ట్మెంట్ లో సర్ప్లస్ గా వచ్చినటువంటి వివరాలన్నీ ఉపాధ్యాయులు చూసుకుని అబ్జెక్షన్ ఏదైనా ఉంటే తెలియజేస్తే ఆ అబ్జెక్షన్ కూడా సరిదిద్దినతర్వాత మాత్రమే కౌన్సిలింగ్ మొదలవుతుంది.

🔯.ఈ కౌన్సిలింగ్లో మాన్యువల్ గా జరిగినప్పటికీ డిజిటలైజేషన్ అంటే కంప్యూటర్లో విల్లింగ్ నెస్ ఇచ్చి ఓకే చేయటం అనేది ఉంటుంది. డిజిటల్ ఆర్డర్స్ రావాలి అనేది విద్యాశాఖ యొక్క అభిప్రాయం.

దీనివల్లతప్పులు దొరలకుండా ఉంటాయనేది విద్యాశాఖ భావిస్తుంది.


🔯.ప్రధానంగా జీవో 117 ను కచ్చితంగా రద్దు చేస్తాం దానికి ప్రత్యామ్నాయంగా మరొక జీవో వచ్చేవరకు ప్రస్తుతం పాఠశాలల్లో ఖాళీలుగా ఉన్న పోస్టులను వర్క్ అడ్జస్ట్మెంట్ లో భర్తీ చేస్తామని తెలియజేశారు.

🔯ప్రస్తుతం జీవో 117 ప్రకారమే వర్క్ అడ్జస్ట్మెంట్ జరుగుతాయి.

🔯అన్ని అడ్జస్ట్మెంట్స్ మండల స్థాయిలోనే జరుగుతాయి.

తరువాత డివిజనల్ స్థాయి లోజరుగుతాయి జిల్లా స్థాయిలో ఉండవు.

దీనికి సంబంధించి మరికొన్ని

*ముఖ్య పాయింట్లు*


🔯. కేడర్లో సీనియారిటీ తీసుకుంటారు,సీనియారిటీ

కేడర్ లోమెరిట్ కం రోస్టర్ లో సీనియార్టీని లెక్కిస్తారు ర్యాంకు కూడాచూస్తారు


🔯. 70% PHC 100% బ్లైండ్ వారికి మినహాయింపు ఉంటుంది


🔯. మే 31. 2025 వరకు రిటైర్ అయ్యే వారిని ఈ కౌన్సిలింగ్లో చూపరు వాళ్లకి ఎగ్జామ్ప్షన్ ఉంటుంది.


🔯 మైనర్ లాంగ్వేజెస్ ఎగ్జాంపుల్ ఉర్దూ వారికి కంప్లీట్ గా మినహాయింపుఇస్తారు


🔯.సీనియర్ ,జూనియర్ విషయంలో ఎవరు విల్లింగ్ ఇచ్చినా తీసుకుంటారు.


🔯 ప్రిఫరెన్షియల్ కేటగిరి .widows,unmarried లీగల్లిసెపరేట్ ఉమెన్ అందర్నీ కూడా వితిన్ మండలంలో అడ్జస్ట్ చేస్తారు డివిజన్ కి పంపరు.

మిగిలిన వారిని డివిజన్ కి పంపరు


🔯.ముందుగా సేమ్ మేనేజ్మెంట్లో అడ్జస్ట్ చేస్తారు మిగులు అయితేనే అదర్ మేనేజ్మెంట్ లోకి అడ్జస్ట్ చేస్తారు.


🔯 మున్సిపల్ ఉపాధ్యాయులకి అవసరమైన పోస్టులు ఆ మున్సిపాలిటీ పరిధిలో ఉండే మండలం నుంచికేటాయిస్తారు అక్కడ కూడా లేనప్పుడువేరే మేనేజ్మెంట్నుంచి కూడా పూర్తి చేస్తారు.


🔯సర్ప్లస్ అయిన వారిని సీనియారిటీ లిస్టు ప్రకారంగా రిటైర్ అయ్యే పోస్టులలో ప్రతినెలా గాని రిటైర్మెంట్ అయిన సందర్భంలో గానీ ఆ వేకెన్సీ ని వీరితో పూర్తి చేస్తారు.

ఈ ప్రక్రియ అంతా జరగడానికి కొంత సమయం పడుతుంది డ్రాఫ్ట్ ఓకే అయ్యి సర్ప్లేస్ లిస్టు ఓకే అయిన తర్వాత ఎటువంటి అబ్జెక్షన్ లేకపోతేనే ప్రక్రియ ప్రారంభం అవుతుంది.


🔯. ముఖ్య గమనిక యూపీ స్కూల్స్ నందు రోల్ ని తీసుకునే సందర్భంలో 1 నుంచి 8వ తరగతి వరకు 98 రోలు ఉంటే 6 మంది స్కూల్ అసిస్టెంట్లను ఇస్తారు.


🔯. *up స్కూల్స్ లో98 కి లోపు రోలు ఉంటే 5 ఎస్జీటీలను మిగులును బట్టి మరొక ఎస్ జి టి ని కూడా ఇవ్వటం జరుగుతుంది. కట్ ఆఫ్ డేటు మరికొంత మారే అవకాశం ఉంది 16. 8.24 వరకు ఉండవచ్చును.*

అలాగే సెప్టెంబర్ 30 వరకు లాంగ్ లీవ్ లో ఉన్న వారిని కూడా అడ్జస్ట్ చేస్తారు.

నెస్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి అకాడమిక్ క్యాలెండర్ మార్పు ఉంటుంది.

బోధనకు ఇబ్బందులు ఆటంకం లేకుండా చూస్తారు.


🔯. యుపి స్కూల్స్ లో పనిచేస్తున్న LP తెలుగులను అక్కడే కొనసాగిస్తామని తెలియజేశారు.


ఈ సమాచారం నచ్చితే కిందనున్న హార్ట్ సింబల్ మీద నొక్కి లైక్ చేసి సపోర్ట్ చేయగలరు

ఈ సమాచారాన్ని మన టీచర్ల గ్రూపుల్లో షేర్ చెయ్యగలరు

ధన్యవాదాలు

0 comments

Recent Posts

See All

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....

Комментарии


bottom of page