top of page
Writer's pictureAP Teachers TV

వడ్డీ లేని ఇన్స్టాల్ మెంట్ తో ఇక చిన్న చిన్న వస్తువుల్ని కూడా ఇలా కొనేయొచ్చు




మామూలుగా మనం అమెజాన్ , ఫ్లిప్ కార్ట్ వంటి ఆన్లైన్ షాపింగ్ సైట్లలో గాని మార్కెట్లో గాని కొన్ని వస్తువులు, విద్యుత్ పరికరాలు,గృహోపకరణాలు ,ఫోన్లు,దుస్తులు వంటివి కొనుగోలు చేస్తాం. వాటి ధర ఎక్కువగా ఉంటే ఈఎంఐ పద్ధతిలో ఇన్స్టాల్ మెంట్ లో కొంటాం . బయటి మార్కెట్ లో పదివేల రూపాయల కన్నా తక్కువ ధర గల వస్తువులు కొన్నప్పుడు వాటిని రొక్కం ఇచ్చి మాత్రమే కొనగలం తప్ప ఇన్స్టాల్ మెంట్ లో సాధారణంగా ఇవ్వరు. అదే ఆన్లైన్ షాపింగ్ లో ఇన్స్టాల్ మెంట్ లో కొనాలంటే మనం కొనదలచిన వస్తువు ధర కనీసం 5000 లేదంటే ₹3000 ఉండాలి. అంతకంటే తక్కువ ధర గల వస్తువులని మనం కొనడానికి ఇన్స్టాల్ మెంట్ విధానం అందుబాటులో లేదు.



కాలం గడిచే కొద్దీ అంతకంతకు పెరుగుతున్న ధరలు, పెరుగుతున్న జీవన వ్యయం, ఆర్థిక సమస్యలు, పెరగని ఆదాయం , పెరుగుతున్న సామాజిక అంతరాలు సామాన్య జనం కొనలేని తినలేని పరిస్థితులు కల్పిస్తున్నాయి. జనంలో కొనుగోలు శక్తి పెరుగుతోంది అనుకునే లోగానే ద్రవ్యోల్బణం సామాన్య జనాన్ని చావు దెబ్బతీస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే చిన్న చిన్న వస్తువులు కొనాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించవలసి వస్తోంది. అదే కంతులలో కొనగలిగే అంటే ఇన్స్టాల్మెంట్లలో కొనగలిగే అవకాశం ఉంటే దైనందిన అవసరాలను సంతోషంగా తీర్చుకోవచ్చు. సరిగ్గా ఇలాంటి అవకాశాన్ని కల్పించేదే ఇప్పుడు మేము చెప్పబోయే ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ ద్వారా అన్ని ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లలోనూ లేదా డైరెక్ట్ ఈ యాప్ లోనే మనకు కావలసిన చిన్న చిన్న వస్తువులు కానివ్వండి పెద్ద వస్తువులు కానివ్వండి తక్కువ ధరవి కానివ్వండి ఎక్కువ ధరవి కానివ్వండి ఈఎంఐ పద్ధతిలో ఇన్స్టాల్మెంటులలో కొనుగోలు చేయవచ్చు. అది కూడా 0% వడ్డీతో అంటే వడ్డీ లేకుండా అతి తక్కువ డౌన్ పేమెంట్ అతి తక్కువ ఇన్స్టాల్ మెంట్లలో... నమ్మశక్యం కాని అద్భుతమైన వరం లాంటి ఈ యాప్ కోసం పూర్తి వివరాలు చూసేయండి మరి. వివరాలకు ఈ కింది వీడియో చూడవచ్చు .




0 comments

Comments


bottom of page