వినాయక వ్రతం కొరకు సేకరించుకొనే 21 రకాల పత్రి -వాటి శాస్త్రీయ నామాలు-వాటి వైద్య విలువలు
vinayaka chavithi images,vinayaka chavithi 2024,vinayaka chavithi 2024 date, vinayaka chavithi pooja vidhanam telugu,vinayaka chavithi subhakankshalu,vinayaka chavithi subhakankshalu in telugu, vinayaka chavithi story in telugu,vinayaka chavithi 2024
#GANESHCHAVITHIPOOJA- THE 21 TYPES OF LEAVES AND THEIR BOTANICAL NAMES
వినాయక వ్రతం కొరకు సేకరించుకొనే 21 రకాల పత్రి -వాటి శాస్త్రీయ నామాలు
1. బృహతి పత్రం BRUHATHI PATHRAM వాకుడు Solanum xanthocarpum, 2. మాచీ పత్రం MAACHEE PATHRAM ధవనం Artimesia aromaticum , 3. బిల్వ పత్రo. BILVA PATHRAM మారేడు Aegle marmelos , 4. దూర్వాక పత్రం DHOORVAKA PATHRAM గరిక Cynodon dactylon , 5. దత్తూర పత్రం DATURA PATHRAM ఉమ్మెత్త Datura stramonium , 6. బదరీ పత్రం BADHARI PATHRAM రేగు , Zizypus jujuba , 7. అపామార్గపత్రం APAMARGA PATHRAM ఉత్తరేణి Achyranthus aspera , 8. తులసి పత్రం. TULSI PATHRAM Ocimum sanctum
9. చూత పత్రం CHOOTHA PATHRAM మామిడి Mangifera indica , 10. కరవీర పత్రం KARAVEERA గన్నేరు
Thevetia peruviana , 11. విష్ణుక్రాంత పత్రం VISHNUKRANTHA విష్ణుక్రాంతి Evolvulus alsinoides
12. దాడిమి పత్రం DHADIMI దానిమ్మ Punica granatum , 13. దేవదారు పత్రం DEVADHAARU Cedrus deodara
14. మరువక పత్రం MARUVAKA మరువం Origonum majorina , 15.సింధువారకి పత్రం SINDHUVARAKI వావిలి Vitex negundo , 16. జాజి పత్రం JAAJI విరజాజి ,Jasminum grandiflorum,17. గణకీ పత్రము GANAKI యూధిక, అడవి మల్లె
Jasminum angustifolium , 18. శమీ పత్రం SHAMEE PATHRAM జమ్మి Prosopis specigera 19. అశ్వద్ద పత్రం ASWADHA రావి Ficus religiosa 20. అర్జున పత్రం ARJUNA తెల్ల మద్ది Terminalia arjuna 21. అర్క పత్రం ARKA జిల్లేడు Calotropis gigantia
నిజానికి ఈ పత్రాలు లో ఆల్కలాయిడ్లు , తైల గ్రంధులతో నిండి ఆయుర్వేద ప్రాముఖ్యత కలిగినవి. నీడలో కొన్ని రోజులు అరబెట్టిన పిదప వినియోగించిన ఔషధ గుణములు పొంద వచ్చును.
The above leaves are composed of several alkaloids and volatile oils.
Hence we consume it by preserved in the shade for a few days before use.
-- శ్రీ కె సాయిరాం , జీవశాస్త్ర ఉపాధ్యాయుడు , వృక్ష శాస్త్ర నిపుణుడు, రాజపత్ర ప్రధానోపాధ్యాయుడు , అమలాపురం
21 రకాల పత్రి వాటి ఆయుర్వేద వైద్య గుణాలు
వినాయక చవితి పర్వదినం పండుగనాడు గణనాధునికి అనేక రకాల పత్రాలతో (ఆకుల) పూజ చేస్తాం. ఔషధ గుణాలున్న ఈ పత్రాలను నవరాత్రులలో ఇంట్లో ఉంచుకున్నందువల్ల పత్రాల నుండి, అలాగే కొత్తమట్టితో తయారుచేసిన గణనాధుడి నుండి ప్రాణవాయువులు వెలువడి ఆ కుటుంబంలోని అందరికి ఆయురారోగ్యాలు పంచుతుంది. ఇది మన పూర్వులైన ఋషులు కనుగొని మనకు నేర్పిన విషయం. దీనిని నేటి మన వైద్యులు కూడా నొక్కి చెబుతున్నారు.
నిజానికి వినాయక చవితి పూజలో వాడే పత్రాలన్నీ21 రకాల పత్రులు అనేవి సాధారణమైన ఆకులు కావు. ఇవన్నీ మహాత్కృష్టమైన, శక్తివంతమైన ఔషధులు. చెట్టు నుండి విడిపోయిన 48 గంటల వరకు ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. అంతేకాక వాటిని 9 రోజుల అనంతరం నీటిలో నిమజ్జనం చేయడం వల్ల వాటి నుండి వెలువడే ఆల్కలాయిడ్స్ నీటిలోకి చేరి అక్కడి రోగకారక క్రిములను, చెడు పదార్థాలను నాశనం చేస్తాయి. ఆ నీటిలో ప్రాణవాయువు శాతాన్ని పెంచుతాయి. అంతేకాక ఆ పత్రి నుండి వెలువడే సుగంధాన్ని పీల్చడం ద్వారా కూడా స్వస్థత చేకూరుతుంది. పత్రిని చేతితో ముట్టుకోవడం వలన కావలసిన మోతాదులో చర్మం ద్వారా మన శరీరంలోకి శోషణం చెంది ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. పిల్లలకు పత్రి సేకరణ వలన విజ్ఞానము, వినోదము, పర్యావరణ పట్ల స్నేహ భావము కలుగుతాయి. విఘ్నేశ్వరుని 21 రకాల ఆకులతో పూజించడం ఆనవాయితీ. ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క ఔషధ గుణాలు ఉన్నాయి.
1. మాచీపత్రం (మాచిపత్రి) :- ఇది దద్దుర్లు, తలనొప్పి, వాత నొప్పులు, కళ్ళకు సంబంధించిన వ్యాధులు, చర్మ సంబంధమైన వ్యాధులు నివారించడానికి ఉపయోగపడుతుంది.
2. బృహతీ పత్రం(వాకుడాకు) : - ఇది దగ్గు, జలుబు, జ్వరం, అజీర్ణం, మూత్ర వ్యాధులను, నేత్ర వ్యాధులను నయం చేయడానికి, దంత ధావనానికి దోహదపడుతుంది.
3. బిల్వ పత్రం( మారేడు) :- ఇది జిగట విరేచనాలు, జ్వరం, మధుమేహం, కామెర్లు, నేత్ర వ్యాధులు, శరీర దుర్గంధం తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
4. దూర్వాయుగ్మం(గరిక) :- ఇది గాయాలు, చర్మ వ్యాధులు, దద్దుర్లు, మూత్రంలో మంట, ముక్కు సంబంధ వ్యాధులు, ఉదర సంబంధ వ్యాధులు, మొలల నివారణకు ఉపయోగపడుతుంది.
5. దత్తూర పత్రం(ఉమ్మెత్త) :- ఇది సెగ గడ్డలు, స్తన వాపు, చర్మ వ్యాధులు, పేను కొరుకుడు, శరీర నొప్పులు, శ్వాసకోశ వ్యాధులు, ఋతు వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. ఇది విషం కావున కాస్తంత జాగ్రత్తగా వాడుకోవాలి.
6. బదరీ పత్రం(రేగు) :- ఇది జీర్ణకోశ వ్యాధులు, రక్త సంబంధ వ్యాధులు, చిన్న పిల్లల వ్యాధుల నివారణకు రోగ నిరోధక శక్తి పెంపుదలకు సహాయపడుతుంది.
7. ఆపామార్గ పత్రం(ఉత్తరేణి) :- ఇది దంత ధావనానికి, పిప్పి పన్ను, చెవి పోటు, రక్తం కారటం, మొలలు, గడ్డలు, అతి ఆకలి, జ్వరం, మూత్ర పిండాలలో రాళ్ళు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
8. తులసీ పత్రం(తులసీ) :- ఇది దగ్గు, జలుబు, జ్వరం, చెవిపోటు, పన్ను నొప్పి, తుమ్ములు, చుండ్రు, అతిసారం, గాయాలు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ముఖ సౌందర్యం, వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడానికి ఉపయోగపడుతుంది.
9. చూత పత్రం( మామిడాకు) :- ఇది రక్త విరోచనాలు, చర్మ వ్యాధులు, ఇంటిలోని క్రిమి కీటకాల నివారణకు దోహదపడుతుంది.
10. కరవీర పత్రం( గన్నేరు) :- ఇది కణుతులు, తేలు కాటు- విష కీటకాల కాట్లు, దురద, కళ్ళ సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగించబడుతుంది.
11. విష్ణుక్రాంత పత్రం( విష్ణు కాంత) :- ఇది జ్వరం, కఫం, దగ్గు, ఉబ్బసం తగ్గించడానికి, జ్ఞాపకశక్తి పెంపొందింపజేయడానికి ఉపయోగపడుతుంది.
12. దాడిమీ పత్రం(దానిమ్మ) :- ఇది విరోచనాలు, అతిసారం, దగ్గు, కామెర్లు, మొలలు, ముక్కు నుండి రక్తం కారడం, కండ్ల కలకలు, గొంతు నొప్పి, చర్మ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
13. దేవదారు పత్రం(దేవదారు) :- ఇది అజీర్తి, పొట్ట సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు, కంటికి సంబంధించిన వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
14. మరువక పత్రం(మరువం) :- ఇది జీర్ణశక్తి, ఆకలి పెంపొదించుటకు, జుట్టు రాలడం, చర్మ వ్యాధులు తగ్గించుటకు ఉపయోగపడుతుంది. దీనిని సువాసనకు ఉపయోగిస్తారు.
15. సింధూర పత్రం( వావిలి) :- ఇది జ్వరం, తలనొప్పి, కీళ్ళ నొప్పులు, గాయాలు, చెవిపోటు, మూర్ఛ వ్యాధి, ప్రసవం తరువాత వచ్చే ఇబ్బందులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
16. జాజీ పత్రం( జాజి ఆకు) :- ఇది వాత నొప్పులు, జీర్ణాశయ వ్యాధులు, మలాశయం వ్యాధులు, నోటి పూత, దుర్వాసన, కామెర్లు, చర్మ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
17. గండకీ పత్రం(దేవ కాంచనం) :- ఇది మూర్ఛ వ్యాధి, కఫం, పొట్ట సంబంధ వ్యాధులు. నులి పురుగుల నివారణకు ఉపయోగపడుతుంది. దీని ఆకులు ఆహారంగా కూడా ఉపయోగిస్తారు.
18. శమీ పత్రం(జమ్మి ఆకు) :- ఇది కఫం, మూల వ్యాధి, కుష్టు వ్యాధి, అతిసారం, దంత వ్యాధులు నివారించడానికి ఉపయోగపడుతుంది.
19. అశ్వత్థ పత్రం ( రావి ఆకు) :- ఇది మల బద్ధకం, వాంతులు, మూత్ర వ్యాధులు, జ్వరాలు నివారించడానికి ఉపయోగపడుతుంది. జీర్ణ శక్తి, జ్ఞాపక శక్తి పెంపొందించడానికి సహకరిస్తుంది.
20. అర్జున పత్రం( తెల్ల మద్ది) :- ఇది చర్మ వ్యాధులు, కీళ్ళ నొప్పులు, మలాశయ దోషాలు, గుండె జబ్బుల నివారణకు ఉపయోగపడుతుంది.
21. ఆర్క పత్రం( జిల్లేడు) :- ఇది చర్మ వ్యాధులు, సెగ గడ్డలు, కీళ్ళ నొప్పులు, చెవిపోటు, కోరింత దగ్గు, దంతశూల, విరేచనాలు, తిమ్మిర్లు, బోధకాలు , వ్రణాలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
Recent Posts
See Allనేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....
Comentários