top of page

వైద్యశాస్త్రంలో విక్టర్‌ ఆంబ్రోస్‌, గ్యారీ రవ్‌కున్‌కు నోబెల్‌ Nobel Prize in Medicine 2024

Writer's picture: AP Teachers TVAP Teachers TV

వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసినందుకుగానూ విక్టర్‌ ఆంబ్రోస్‌, గ్యారీ రవ్‌కున్‌కు ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారం (The Nobel Prize 2024) వరించింది.


స్టాక్‌హోం: వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసినందుకుగాను విక్టర్‌ ఆంబ్రోస్‌, గ్యారీ రవ్‌కున్‌లకు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారం (The Nobel Prize 2024) వరించింది. మైక్రో ఆర్‌ఎన్‌ఏ, పోస్ట్‌ ట్రాన్‌స్ర్కిప్షనల్‌ జీన్‌ రెగ్యులేషన్‌లో దాని పాత్రను కనుగొన్నందుకు గుర్తింపుగా పురస్కారం లభించింది. స్వీడన్‌లోని స్టాక్‌హోంలో ఉన్న కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని నోబెల్‌ బృందం ఈ పురస్కారాలను ప్రకటించింది.

కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినందుకుగాను హంగేరి అమెరికన్‌ కాటలిన్‌ కరికో (Katalin Kariko), అమెరికాకు చెందిన డ్రూ వెయిస్‌మన్‌ (Drew Weissman)లకు గతేడాది వైద్యశాస్త్రంలో నోబెల్‌ వచ్చింది. వైద్యశాస్త్రంలో మొత్తంగా ఇప్పటివరకు నోబెల్‌ బహుమతిని 114 సార్లు ప్రకటించగా.. 227 మంది అందుకున్నారు. ఇందులో కేవలం 13 మంది మహిళలు మాత్రమే ఉన్నారు.



వైద్య విభాగంతో మొదలైన నోబెల్‌ పురస్కారాల ప్రదానం అక్టోబర్‌ 14 వరకు కొనసాగనుంది. మంగళవారం భౌతికశాస్త్రం, బుధవారం రసాయనశాస్త్రం, గురువారం సాహిత్య విభాగాల్లో విజేతలను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున నోబెల్‌ శాంతి బహుమతి (Nobel Peace Prize 2024), అక్టోబర్‌ 14న అర్థశాస్త్రంలో నోబెల్‌ గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.

స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్‌, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించినవారికి ఈ అవార్డును ప్రదానం చేస్తోన్న సంగతి తెలిసిందే. 1896లో ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. అవార్డు గ్రహీతలకు 11 లక్షల స్వీడిష్‌ క్రోనర్‌ (10 లక్షల డాలర్లు) నగదు అందుతుంది. వీటిని డిసెంబర్‌ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు.




 
 

Recent Posts

See All

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...

Comments


bottom of page