top of page

విద్యాశాఖ మంత్రితో ఉపాధ్యాయ సంఘాల సమావేశం: ఫలితాలు

Writer's picture: AP Teachers TVAP Teachers TV

నిన్న విజయవాడ నందు సీఎం నివాసంలో విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పలు విద్యారంగా ఉపాధ్యాయ సమస్యలను చర్చించడం జరిగింది. విద్యా రంగ మరియు ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని నారా లోకేష్ గారు తెలియజేశారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు తో పాటు ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, గంజి చిరంజీవి, అశోక్ బాబు, రాంభూపాల్ రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు, సమగ్ర శిక్ష ఎస్పిడి శ్రీనివాసరావు, తదితర విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


ఈ సమావేశంలో ముఖ్య అంశాలు;

1. జీవో 117 రద్దుకు కట్టుబడి ఉన్నామని ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు మేరకు నూతన జీవోను తీసుకువస్తామని తెలిపారు.

2. వీలైనంత ఎక్కువగా మోడల్ ప్రైమరీ స్కూళ్ళన ఏర్పాటు చేసి తరగతికి ఒక ఉపాధ్యాయున్ని ఇస్తామని తెలిపారు 120 రోలు దాటిన పాఠశాలకు ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ పోస్టు ఇస్తామని తెలిపారు.

3. తెలుగు మీడియం కొనసాగించే విషయమై అభిప్రాయ సేకరణ తీసుకుంటున్నామని తెలిపారు.

4. హై స్కూల్ ప్లస్ లను కొనసాగించడం ఇబ్బందికరంగా ఉందని, వీలైతే జూనియర్ కళాశాల లేని అన్ని మండలాల్లో జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పారు.

5. జూనియర్ కళాశాలలో 40 శాతం కోటా ప్రమోషన్లు పునరుద్ధరించాలని ఆపస్ పక్షాన కోరగా తప్పకుండా ప్రయత్నం చేస్తామన్నారు.

6. ప్రభుత్వం ద్వారా ఏమైనా ఇబ్బందికర నిర్ణయాలు తీసుకున్నట్లయితే తమ దృష్టికి తీసుకువస్తే తప్పకుండా వెనక్కి తీసుకుంటామని తెలిపారు.

7. సిపిఎస్ ఉద్యమ కేసులను ఎత్తివేయుటకు నిర్ణయం తీసుకున్నామని, త్వరలోనే ఉత్తర్వులు ఇప్పిస్తానని తెలిపారు.

8. ఉపాధ్యాయుల సెలవుల వినియోగంపై ఎటువంటి ఆంక్షలు ఉండవని, అవసరాన్ని బట్టి సంబంధిత అధికారులు నిర్ణయం తీసుకోవచ్చు అని తెలిపారు.

9. బదిలీలకు అకాడమిక్ ఇయర్స్ నే చేసుకోవడం జరుగుతుందని తెలిపారు.

10. మెమో నంబర్ 57 అమలకు చర్యలు తీసుకుంటామని, అధికారులతో సంప్రదిస్తానని తెలిపారు.

11. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అకాడమీకు సంబంధించిన యాప్లు మాత్రమే అనగా అటెండెన్స్ ,మార్కులు మాత్రమే ఉపాధ్యాయులు చేయాలని, మిగిలిన యాప్లు ఏమీ వారు చేయాల్సిన అవసరం ఉండదని తెలిపారు.

12. ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలకు ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి గారితో చర్చించి ఏర్పాటు చేస్తామని తెలిపారు.

13. డిఈఓ పూల్ పండిట్ల సమస్యను పరిష్కరించాలని కోరగా కమిషనర్ గారికి ఈ విషయమై ఆలోచించాలి అని తెలిపారు.

14. అంతర్ జిల్లా బదిలీలు, డీఎస్సీలో సంస్కృతం మరియు స్పెషల్ పోస్టుల భర్తీ విషయమై డిమాండ్ చేయడం జరిగింది.

15. ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో వందరోజుల యాక్షన్ ప్లాన్ ను మార్పు చేయాలని, హిందీ సోషల్ సబ్జెక్టుల సిలబస్ తొలగించాలని, ఇంకా అన్ని పాఠ్య పుస్తకాలను సమీక్షించి ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పు చేయాలని కోరడం జరిగింది.

16. చాగంటి గారితో నైతిక విలువలు పై ప్రతివారం ఒక గంట కార్యక్రమం నిర్వహించాలని, ఏడూ వారికి 50 శాతం సర్వీస్ వెయిటేజ్ ఇవ్వాలని కోరడం జరిగింది.

17. ఇటీవల టాయిలెట్లు నిర్మించిన పాఠశాలలన్నింటికీ ఆయా పోస్టులు ఇవ్వాలని కోరడం జరిగింది.

18. ఎంటిఎస్ 98 మరియు 2008 వారికి పదవి విరమణ వయస్సు 62 సంవత్సరాలు పెంచాలని కోరడం జరిగింది.

ఇంకా అనేక సమస్యలను మంత్రిగారి దృష్టికి తీసుకువెళ్లగా మంత్రిగారు సానుకూలంగా స్పందించి ప్రతి సమస్యను పరిష్కరిస్తామని, విద్యా శాఖ ఉన్నతాధికారులు నిరంతరం అందుబాటులో ఉండి మీ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తారని తెలిపారు.

మంత్రిగారు కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉపాధ్యాయ సంఘాలతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తానని తెలిపారు.

117 జీవో ప్రతిపాదనలు, బదిలీల శాశ్వత నిబంధనలు, పదోన్నతులు విషయమై కమిషనర్ గారు మరల ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.


 
 

Recent Posts

See All

Comments


bottom of page