top of page
Writer's pictureAP Teachers TV

విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రవీణ్‌ప్రకాశ్‌ సమావేశాలు వాయిదా! కారణమిదే!!

విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రవీణ్‌ప్రకాశ్‌ సమావేశాలు వాయిదా. ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్‌ 2, 23న నిర్వహించాల్సిన వీడియో కాన్ఫరెన్సులను అత్యవసర కార్యక్రమాల కారణంగా వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ప్రకటించారు. ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్‌ 2, 23న నిర్వహించాల్సిన వీడియో కాన్ఫరెన్సులను అత్యవసర కార్యక్రమాల కారణంగా వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ప్రకటించారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ఏప్రిల్‌ 2 ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులతో, ఏప్రిల్‌ 23న విద్యార్థుల తల్లిదండ్రులతో వీసీలు నిర్వహిస్తానంటూ ఆయన ఇటీవల ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఎన్నికల విధులు నిర్వర్తించే ఉపాధ్యాయులు, ఓటర్లు అయిన విద్యార్థుల తల్లిదండ్రులను ప్రభావితం చేసేందుకే ఇవి ఏర్పాటు చేశారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయన వాటిని వాయిదా వేసుకోవడం గమనార్హం. సార్వత్రిక ఎన్నికల విధుల శిక్షణ, పదో తరగతి పరీక్షల మూల్యాంకనం.. రెండూ ఏప్రిల్‌ 1నే ఉండటంతో ప్రభుత్వ ఉపాధ్యాయులు దేనికి హాజరుకావాలా? అనే సందిగ్ధంలో ఉన్నారని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, ఎస్‌.చిరంజీవి తెలిపారు. ఈ విషయంపై స్పష్టత ఇవ్వాల్సిందిగా పదో తరగతి పరీక్షల విభాగం డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డిని సమాఖ్య ప్రతినిధులు కోరారు. జిల్లా విద్యాధికారులతో చర్చించాక సమాచారమిస్తామని ఆయన తెలిపినట్లు శనివారం ఓ ప్రకటనలో సంఘ నాయకులు తెలిపారు.

0 comments

Recent Posts

See All

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....

Comentarios


bottom of page