top of page

విద్యా - ఉపాధ్యాయ వార్తలు : ప్రస్తుత పరిణామాలు : AP Education; Teachers

Writer's picture: AP Teachers TVAP Teachers TV


ప్రతి పాఠశాలలో Dec 7 న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తల పెట్టిన Mega parent Teacher Meeting ను Teachers అందరూ Team spirit తో జయప్రదం చేయటం ఉద్యోగులుగా మన విధి. ఇంత ఖర్చుతో పెట్టే ఈ మీటింగ్ ల Motive ఏమిటో ఇంకా తెలియరాలేదు

తల్లితండ్రులకు , విద్యార్థులకు శనివారం మెనూ తో మద్యాహ్న భోజనం శుచిగా , రుచిగా అందించాలి. ..ప్రభుత్వం సూచించిన రీతిలో తల్లి తండ్రులకు విడి విడిగా ఆటల పోటీలు నిర్వహించాలి. వీలయితే Lucky Dip ను పెట్టి Prize లు ఇస్తే మంచి స్పందన ఉండవచ్చును

SMC సభ్యులకు HM,తల్లి తండ్రులకు టీచర్లు ఫోన్లు చేసి వ్యక్తిగతంగా ఆహ్వానిచాలి

Leader ship Training లో పాల్గొనే వారు Evening ఇంటికి వెళ్ళుటకు అనుమతి ఇవ్వబడినది

SA 1 పరీక్షల తర్వాత 3 వ విడత శిక్షణ ఉండును

టీచర్ల బదిలీల శాశ్వత Act కొరకు ప్రతిపాదనలు DSE నుండి ప్రభుత్వ ఆమోదం కొరకు 1/2 రోజులలో పంపబడుచున్నవి .GAD, Law, Fin dept ల ఆమోదము తర్వాత కేబినెట్ ,అసెంబ్లీ ఆమోదము తో Act గా రూపొందును

2023 మే/, జూన్ లో బదిలీలు జరిగిన G.O 47 లోని ఎక్కువఅంశాల తో బాటు కొద్ది అదనపు అంశాలతో Act లో Incorporate చేసినట్లు సమాచారం.



ఒక పాఠశాలను Preferential కేటగిరీ వారు కోరుకునే అవకాశము ఇవ్వకూడదనే నిబంధన నిలవక పోవచ్చు. ఏదైనా ఈ Act కోర్టుల పాలు కాకుండా అందరం చూసుకోవాల్సి ఉన్నది.

బదిలీల Act తేవాలనే దశాబ్దాల కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వ ఆలోచన చేయటం ఆహ్వానించ దగినదే.

HS లలో 3-5 తరగతుల మెర్జింగ్ ఉపసంహరించు నిర్ణయం జరిగిన దరిమిలా G.O 117 &128కు సవరణ/ రద్దు జరగవచ్చు

HS లన్నీ 6-10 తరగతులు మాత్రమే ఉంటాయి. 3-10 తరగతులున్న HS లు ఉండవు.


మెర్జింగ్ ఉపసంహరణ వల్ల మిగిలి పోయే School Asst ను Model primary School HMలుగా, SGT లతో పని చేసే UP school కు SA పోస్టులు, HS లకు అదనంగా SA పోస్టులు , 60 దాటినUP లను HS లుగా Upgrade చేసి కొన్ని, 75 దాటిన UP లకు HM లు ఇవ్వటం వలన SA పదోన్నతుల ఇచ్చి సర్దుబాటు చేస్తారు.అయినా ఇంకా కొద్ది మంది SA లు మిగులుతారు.Viable గా లేని Girls HS plus లలో ని SA లను కూడా సర్దు బాటు చేయవలసి ఉండును. HS లలో రోలు పడిపోతే చాలామంది SA లు Surplus గా మిగిలి పోతారు .దీని ప్రభావం SGT to SA పదోన్నతులపై పడవచ్చును


Roll 55-60 దాటిన 4000 PS లను 5 తరగతులతో Model PS లుగా మార్చి School Asst /LFL ను HM గా ఉంచుతారు.

State లో 29000, పైగా PS లుంటే కేవలం 4000 ( రోలు 55 కంటె ఎక్కువ)PS లు మాత్రమే Model PS లకు అర్హత పొందుతున్నాయి

ఒక Habitation లో 55 కంటే తక్కువ Roll ఉన్న దగ్గర లోనిModel PS లో Merge అవుతాయి .దీని పై గ్రామ సభలలో/SMCలలో నిర్ణయం జరుగును ఒక గ్రామంలో Roll ఉంటే ఎన్ని Model PS లైనా ఉండవచ్చును


60 కంటే తక్కువ రోలు ఉన్న UP లు దగ్గర 5Km పరిధి లోని HS లో విలీనం


Optimum Roll లేని Habitation లో Basic Primary School మాత్రమే ఉండును


Model primary School లో చిన్న PS ల మెర్జింగ్ మంచి నిర్ణయం. Primary Education మరల పూర్వ వైభవం పొందాలంటే ఇది ఒక్కటే చివరి అవకాశం.ఈ విషయములో ప్రభుత్వం కులాలు, రాజకీయాలు పట్టించు కోకుండా ముందుకెళ్ళాలని కఠినంగా Political Decision తీసుకొన్నట్లు తెలుస్తుంది. Roll పెంచటం కోసం గట్టి ప్రయత్నం చేయాలనే సంకల్పంతో

Roll ఉంటేనే Posts అనే నినాదం తో విద్యాశాఖ ముందుకు వెళుతుంది. దీని కోసం టీచర్లు, సంఘాలకు బాధ్యతలు అప్పగించే ప్రయత్నం. *Roll పెంచే బాధ్యత టీచర్లదే* 28000 కోట్ల బడ్జెట్ తో ఉన్న విద్యాశాఖ Enrollment ను ఒక సవాలుగా తీసుకొనే పనిలో పడి సంస్కరణలతో ముందుకు అడుగులు వేస్తున్నది.


ఇన్ని పధకాలు ఇస్తున్నా మొత్తం విద్యార్థుల రోలులో 50% వాటా Private Schools లో ఉండటం విద్యాశాఖ ఛాలెంజ్ గా తీసుకొన్నది.


మధ్యాహ్న భోజనం నిర్బంధం చేయటం పట్ల మధ్య తరగతి వర్గాలు అసంతృప్తి తో చేరికలు బాగా తగ్గినవి


చిన్న PS లను Model PS తో Mapping చేసి Merge చేస్తారు. Habitation లో Model primary School గాని Basic Primary కాని ఏదో ఒకటే ఉండును. కాలువలు, NH, Railway gate వంటి Natural Barriers ఉన్న చోట తప్ప Model PS లోకి Merging ఆగదు దీని కోసం ప్రతి గ్రామంలో ఏ ఏ పాఠశాలలను Roll , భవనాలను., దూరం, Accessibility ను Model, Basic PS లుగా పరిగణించాలో మండల కమిటీ అధ్యయనం చేస్తుంది.


Dyeo లుగా పనిచేయుచున్న AD లందరినీ వెనుకకు పంపించటం వలన ఖాళీ అయిన Dyeo పోస్టులలోకి. పదోన్నతులు ఇవ్వకుండా Govt HM/MEO లను అదే స్కేలులో DyEO లుగా గాని /FAC లుగా నియమిస్తారేమో. ప్రస్తుతం Court లో ఉన్న Contempt కేసుల వలన ZP HM /MEO లకు అవకాశము లేదు. ఈ చిక్కు ముడిని ఎలా విప్పుతారో చూడాలి.


గుర్తింపు పొందిన సంఘాలు ఎప్పడూ టీచర్ల గురించే కాకుండా విద్యార్థుల వికాసమునకు కూడా టీచర్లు శ్రధ్ధ పట్టేట్లు చూడాలని అప్పుడే టీచర్ల కోసం చేసే మీ ప్రాతినిథ్యాలకు విలువ ఇస్తామని సెక్రటరీ గారు ఖరాఖండిగా చెప్పారు పాఠశాలలో విద్యార్థుల హాజరు 90% ఉంటే టీచర్ల హాజరు 75% ఉండటం శోచనీయమని అధికారులు పేర్కొన్నారు. HS లలో 10%మందికి మాత్రమే CL ఇవ్వాలని ఆదేశాలిచ్చారు


వచ్చే విద్యాసంవత్సరము నుండి HS plus లు School Education పరిధి లో ఉండవు . వీటిని కొనసాగించే నిర్ణయం. Intermediate Education కు వదిలేస్తారట. ఈ నిర్ణయం వలన HS plus లలో PGT లుగా ఉన్న SA లందరూ వెనుకకు రావల్సిందే. Inter board ఆథీనంలో ఉన్న జూనియర్ కాలేజీలలో చాలా Viable గా లేవు కనుక HS plus ల నిర్వహణ కూడా కష్టమే .


అన్నీ సవ్యంగా జరిగితే ఈ నిర్ణయాలతో వచ్చే ఏడాది టీచర్ల కు బదిలీలు, రేషనలైజేషన్ తో జూనియర్లకు భారీ కుదుపు ఉండ వచ్చు. రాబోయే భారీ మార్పుల గురించిన ఆలోచనలతో ఆందోళన చెందుతున్నారు


పట్టణాలకు దూరంగా Roll ఎక్కువగా ఉన్న స్కూళ్ళకు వైభోగమే . టీచర్ల తో పాటు అదనపు గదులు వస్తాయి


SSC Action plan విడుదల చేసి ఆదివారాలతో సహా టీచర్లు పని చేయాలని ,సెలవులలో పని చేసిన వారికి CCL ఇస్తామని DSE వారు రోజు వారీ షెడ్యూల్ ను విడుదల చేశారు.CL s నే వాడుకోకుండా నిరోధిస్తున్న ప్పుడు CCL ఏమి చేసుకొంటామని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.హైస్కూలు టీచర్లు ఆదివారాలు పనిచేయాల్సి రావటం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ "గిచ్చుడు" ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


జిల్లా విద్యాశాఖలు Action Plan లు రూపొందిస్తే వాటినే. అమలు చేసికోవచ్చు. సంక్రాంతి సెలవులలో విద్యార్థులు self preparation at home కు అవకాశం ఇచ్చి టీచర్లను Assignments ను ఇవ్వమని సూచన చేశారు


Supdts కు AD లుగా పదోన్నతుల లపై త్వరలో నిర్ణయం తీసుకోనట్లు తెలుస్తుంది


విద్యాశాఖ ను సమూల ప్రక్షాళన చేసి పాఠశాలలో Enrollment వచ్చే ఏడాదినుండి గణ నీయంగా పెంచి పూర్వ వైభవాన్ని తేవాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తుంది.


March 2025 లో ఎన్నికలు జరిగే MLC నియోజక వర్గాలలో Graduate /Teacher MLC ఓటు నమోదుకు చివరి తేది Dec 9.


2024-25 Fy కు ITను compute చేసుకొని deduction పెంచేవారు డిసెంబరు నుండి పెంచుకోవాలి



 
 

Recent Posts

See All

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...

Comments


bottom of page