వాట్సాప్‌లో కొత్త అప్‌డేట్ AIని ఇలా ఉపయోగించండి
భారతదేశంలో మెటా ఎట్టకేలకు తన ఏఐ చాట్‌బాట్‌ను ఇటివల ప్రారంభించింది. దీంతో ఇప్పుడు మీరు WhatsApp, Facebook, Instagram, Messenger వంటి యాప్‌లలో AI చాట్‌బాట్‌ను ఉపయోగించవచ్చు. అయితే దీనిని ఎలా ఉపయోగించుకోవాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
భారతదేశంలో మెటా ఎట్టకేలకు తన ఏఐ చాట్‌బాట్‌ను ఇటివల ప్రారంభించింది. దీంతో ఇప్పుడు మీరు WhatsApp, Facebook, Instagram, Messenger వంటి యాప్‌లలో AI చాట్‌బాట్‌ను ఉపయోగించవచ్చు. Meta AI రెండు నెలల క్రితమే ప్రారంభించబడింది. దీనిని ముందుగా కేవలం న్యూజిలాండ్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో మాత్రమే ప్రవేశపెట్టారు.
లామా 3 ఆధారంగా
ai.meta.com అధికారిక బ్లాగ్ ప్రకారం మెటా ఏఐ లామా 3 ఆధారంగా పనిచేస్తుంది. మా అధునాతన మోడల్ Meta AI అనేది ఒక తెలివైన సహాయకుడిగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఇది అనేక ప్రశ్నలకు సమాధానం, సూచనలు ఇస్తుందని తెలిపారు. దీనికి నేరుగా సిఫార్సులు అందించడం ద్వారా Meta AIని సమర్ధవంతంగా వినియోగించవచ్చని వెల్లడించారు. Meta AI ఫేస్‌బుక్ ఫీడ్‌లో కూడా కనిపిస్తుంది. దీంతోపాటు మీరు meta.aiని సందర్శించడం ద్వారా కూడా దీన్ని ఉపయోగించవచ్చు. మెటా ఏఐ ప్రస్తుతం ఆంగ్ల భాషకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది.
వాట్సాప్‌లో Meta AIని ఎలా ఉపయోగించాలంటే..
ముందుగా మీ వాట్సాప్‌ని అప్‌డేట్ చేయండి
ఆ తర్వాత మీకు యాప్‌లో గుండ్రంగా ఉండే Meta AI లోగో కనిపిస్తుంది
దానిపై మీరు క్లిక్ చేసి మీకు నచ్చిన ప్రశ్నలను అడగవచ్చు
Meta AI ప్రశ్నలను చదివి, ప్రత్యుత్తరం టెక్ట్స్ ఇస్తుంది
మీరు రాజకీయాలు మినహా ఏదైనా అంశాలపై Meta AIని అడగవచ్చు మీరు ఫోటో, ఆడియో ద్వారా Meta AIకి ఎలాంటి ప్రశ్నలు అడగలేరు
మీరు Meta AIకి గణిత శాస్త్ర ప్రశ్నలను కూడా సంధించవచ్చు
ప్రస్తుతం ఇంగ్లీష్ బాషలో మాత్రమే ప్రశ్నలకు సమధానాలు ఇస్తుందనేది గుర్తుంచుకోవాలి
Recent Posts
See Allనేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....
Comentários