రిఫండు కోసం ఎదురుచూస్తుంటే..#ITrefund
రిటర్నులను ప్రాసెసింగ్ చేసేందుకు, వేగంగా రిఫండులను అందించేందుకు ఆదాయపు పన్ను శాఖ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. కొందరికి రిటర్నులు దాఖలు చేసిన రెండు మూడు రోజుల్లోనే రిఫండు అందింది. #ITrefund
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు బుధవారంతో పూర్తయ్యింది. అర్హత ఉన్న కొందరికి ఇప్పటికే రిఫండు వచ్చేసింది. రానివారి జాబితాలో మీరుంటే ఏం చేయాలో చూద్దామా..
రిటర్నులను ప్రాసెసింగ్ చేసేందుకు, వేగంగా రిఫండులను అందించేందుకు ఆదాయపు పన్ను శాఖ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. కొందరికి రిటర్నులు దాఖలు చేసిన రెండు మూడు రోజుల్లోనే రిఫండు అందింది.
ఇ-వెరిఫై చేశారా?
ఆదాయ రకాలను బట్టి, వర్తించే ఐటీఆర్ ఫారాల్లో రిటర్నులు దాఖలు చేసి, ఇ-వెరిఫై చేసినప్పుడే వాటిని ప్రాసెస్ చేస్తారు. రిటర్నులను సమర్పించిన వెంటనే లేదా 30 రోజులలోపు వెరిఫై చేయాల్సి ఉంటుంది. మీరు ఇంకా చేయకపోతే వెంటనే ఆ పనిని పూర్తి చేయండి.
అదనపు సమాచారం..
రిఫండు కోరుతూ మీరు రిటర్నులు దాఖలు చేసినప్పుడు, పరిశీలించే క్రమంలో కొంత అదనపు సమాచారాన్ని కోరే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి, మీ మొబైల్‌కు, ఇ-మెయిల్‌కు సందేశాలను పంపిస్తారు. వీటిని పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోండి. ముఖ్యంగా అర్హత ఉన్న మొత్తం కన్నా అధికంగా రిఫండును క్లెయిం చేసినప్పుడు ఇలాంటి నోటీసులు వచ్చే అవకాశం ఉంది.
బ్యాంకు ఖాతా సరిగా ఉందా?
కొన్నిసార్లు మీ బ్యాంకు వివరాలు సరిగా ఉండకపోవచ్చు. కాబట్టి, మీరు రిటర్నులు దాఖలు చేసినప్పుడు ఇచ్చిన బ్యాంకు వివరాలను సరిచూసుకోండి. ఖాతా సంఖ్య, ఐఎఫ్‌ఎస్‌సీలాంటివి మరోసారి తనిఖీ చేసుకోండి.
వివరాల్లో వ్యత్యాసాలుంటే..
ఫారం 26ఏఎస్‌లో ఉన్న వివరాలు, మీరు దాఖలు చేసిన రిటర్నులలో ఉన్న సమాచారంలో ఎలాంటి వ్యత్యాసాలు ఉండకూడదు. ముఖ్యంగా చెల్లించిన పన్ను వివరాల్లో తేడా ఉంటే, ఆ రిటర్నులను తిరస్కరించే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను పోర్టల్ గణాంకాల ప్రకారం.. 7.2 కోట్లకు పైగా రిటర్నులు దాఖలైతే.. వీటిల్లో ఇప్పటికి 6.3 కోట్ల రిటర్నులు వెరిఫై అయ్యాయి. ఇందులో 2.6 కోట్ల రిటర్నులే ప్రాసెస్ అయ్యాయి. కాబట్టి, మిగతా ప్రాసెస్ కాని వాటి జాబితాలో మీ రిటర్ను ఉండే అవకాశం లేకపోలేదు. కాబట్టి, కాస్త వేచి చూడక తప్పదు. ఒకసారి ఆదాయపు పన్ను పోర్టల్‌లోకి లాగిన్ అయి మీ రిటర్నుల పరిస్థితి ఎంత వరకూ వచ్చిందో చూసుకోవచ్చు.
అపరాధ రుసుముతో..
గత ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీ రిటర్నులను గడువు లోపు దాఖలు చేయలేదా? నికర పన్ను ఆదాయం రూ.5లక్షలకు మించి ఉంటే.. రూ.5,000 అపరాధ రుసుముతో రిటర్నులు సమర్పించేందుకు వీలుంటుంది. పన్ను వర్తించే ఆదాయం రూ.5లక్షలకు లోపున్న వారు రూ.1,000 చెలించాల్సి ఉంటుంది. గడువులోపు రిటర్నులు దాఖలు చేయని వారు.. పాత పన్ను విధానాన్ని ఎంచుకునే అవకాశాన్ని కోల్పోయినట్లే.
Recent Posts
See Allనేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....
Comments