top of page

రూ.6కే అన్‌లిమిటెడ్‌.. బీఎస్‌ఎన్‌ఎల్‌లో బెస్ట్‌ ప్లాన్‌

Writer's picture: AP Teachers TVAP Teachers TV

ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌.. తన చవక రీచార్జ్‌ ప్లాన్‌లతో ప్రైవేట్ టెలికాం కంపెనీలకు నిద్రలేకుండా చేస్తోంది. ఈసారి రోజుకు రూ. 6 ఖర్చుతోనే  అపరిమిత కాలింగ్, 2జీబీ డేటాను అందించే అద్భుతమైన ప్లాన్‌ను తీసుకొచ్చింది. అది ఏ ప్లాన్.. ఎన్ని రోజులు వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఏంటి అన్నవి ఇక్కడ తెలుసుకుందాం…


ఇటీవల, ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. కానీ ప్రభుత్వ టెల్కో అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం రీఛార్జ్ ప్లాన్‌ల ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో ఖరీదైన టారిఫ్ ప్లాన్‌లను భరించలేని లక్షల మంది వినియోగదారులు ఆయా కంపెనీలను వీడి బీఎస్‌ఎన్‌ఎల్‌కి మారుతున్నారు. #bsnl #bsnlunlimitedplan 

కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి, పాత యూజర్లను ఆకట్టుకునేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా రోజుకు 6 రూపాయల కంటే తక్కువ ధరతో అపరిమిత కాలింగ్, 2GB డేటా, ఇతర అనేక ప్రయోజనాలను అందించే ప్లాన్‌ అందిస్తోంది. ఇది ఏడాదికిపైగా సుదీర్ఘ వ్యాలిడిటీని అందిస్తుంది. తరచుగా రీఛార్జ్ చేసే టెన్షన్‌ను తొలగిస్తుంది.


ప్లాన్ వివరాలు

ఈ ప్లాన్ ధర రూ. 2399. దీని వ్యాలిడిటీ 395 రోజులు. రోజు ప్రకారం చూస్తే రూ. 6 కంటే తక్కువ ఖర్చుతో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. బడ్జెట్ విభాగంలో ఈ ప్లాన్ చాలా అద్భుతంగా కనిపిస్తోంది. ఇందులో అపరిమిత కాలింగ్, రోజువారీ 2GB డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఒక్క సారి రీఛార్జ్ చేస్తే నాన్‌స్టాప్ ఇంటర్నెట్, కాలింగ్‌ని ఆస్వాదించవచ్చు.


 
 

Recent Posts

See All

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...

Comments


bottom of page