top of page
Writer's pictureAP Teachers TV

రూ.2 వేల నోటు రద్దు-ఆర్బీఐ సంచలన నిర్ణయం

Updated: May 20, 2023

ముంబై: రూ.2000 నోటు చలామణిపై సందేహాలకు కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) చెక్ పెట్టింది. ఈ పెద్ద నోటును చలామణి నుంచి ఉపసంహరిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చింది. ఈ మేరకు నోట్ల జారీని తక్షణమే నిలిపివేయాలంటూ దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. అయితే సెప్టెంబర్ 30, 2023 వరకు ఈ నోటు చట్టబద్ధంగానే చెల్లుబాటు అవుతుంది. అయితే ఇప్పటికే ఎవరి వద్దయినా నోట్లు ఉంటే సెప్టెంబర్ 30 లోగా బ్యాంకుల వద్ద మార్చుకోవచ్చు. ఒక్కో విడతలో రూ.20 వేల విలువైన నోట్లను ఎక్స్చేంజ్ చేసుసుకునేందుకు ఆర్బీఐ అవకాశం కల్పించింది. అకౌంట్‌లో జమ చేసుకోవచ్చు లేదా ఇతర నోట్లతో మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ప్రకటనలో స్పష్టం చేసింది. ‘క్లీన్ నోట్ పాలసీ’లో భాగంగా రూ.2 వేల నోటును చెలామణీ నుంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్టు ఆర్బీఐ వెల్లడించింది.

కాగా రూ.2000 నోట్లు నవంబర్ 2016లో ఆర్బీఐ చట్టం 1934లోని సెక్షన్ 24(1) కింద చెలామణిలోకి తీసుకొచ్చారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత ఈ నోటును ఆర్బీఐ ప్రవేశపెట్టింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత అవసరాలకు తగ్గట్టు కరెన్సీ లభ్యతే లక్ష్యంగా ఈ నోట్లను ప్రవేశపెట్టారు. అయితే 2018-19 నుంచి ప్రింటింగ్ నిలిపివేసినట్టు ఆర్బీఐ ప్రకటించింది. చెలామణిలోకి వచ్చిన రెండు వేల రూపాయల నోట్లలో 89 శాతం మార్చి 2017 కంటే ముందే జారీ అయ్యాయి. 31 మార్చి 31 నాటికి గరిష్ఠంగా రూ.6.73 లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు చెలామణిలో ఉన్నాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ 31 మార్చి 2023 నాటికి ఈ విలువ రూ.3.62 లక్షల కోట్లకు పడిపోయింది. ప్రస్తుతం చెలామణిలో ఉన్న కరెన్సీలో ఈ విలువ 10.8 శాతంగా ఉంది. అకౌంట్లలో జమ చేసుకునేవారిపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. నిబంధనలేమీ వర్తించవు. కాగా బ్యాంకుల వద్ద ఎలాంటి అవాంతరాలు లేకుండా రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు రూ.20 వేల వరకు రెండు వేల నోట్లను మార్చుకోవచ్చు. అయితే సెప్టెంబర్ 30, 2023 వరకే ఈ ఎక్స్చేంజ్‌కు అవకాశం ఉంటుంది.




రూ.2వేల నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక ప్రకటన చేసింది. కస్టమర్లకు ఈ నోట్లను ఇవ్వవద్దని బ్యాంకులకు సూచించిన ఆర్‌బీఐ.. తమ వద్ద ఉన్న నోట్లను సెప్టెంబర్‌ 30లోగా మార్చుకోవాలని ప్రజలకు సూచించింది. అయితే, నోట్లు ఉపసంహరణపై ప్రజల్లో నెలకొనే పలు ప్రశ్నలు/సందేహాలకు ఆర్‌బీఐ సమాధానాలు ఇచ్చింది.*


*💥1.ఎందుకు రూ.2వేల నోట్లను ఆర్‌బీఐ ఉపసంహరించుకుంటోంది?*


*◼️ఆర్‌బీఐ చట్టం-1934లోని సెక్షన్‌ 24(1) ప్రకారం రూ.2వేల నోటును ప్రవేశపెట్టాం. పెద్దనోట్ల రద్దు తర్వాత కరెన్సీ నోట్ల డిమాండుకు సరిపడా కరెన్సీని మార్కెట్‌లో అందుబాటులో ఉంచేందుకే ఈ నోటును తీసుకొచ్చాం. మార్కెట్‌లో అవసరమైన కరెన్సీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. 2018-19లోనే రూ.2వేల నోటును ముద్రించడం నిలిపివేశాం. ప్రస్తుతం చలామణీలో ఉన్న రూ.2వేల నోట్లన్నీ మార్చి 2017కు ముందు ముద్రించినవే. వాటి జీవితకాలం 4-5ఏళ్లు మాత్రమే.*


*💥2. రూ.2వేల నోటు చెల్లుబాటు అవుతుందా?*


*◼️అవును. రూ.2వేల నోటు చెల్లుబాటు అవుతుంది.*


*💥3. సాధారణ లావాదేవీలకు ఈ నోట్లను ఉపయోగించవచ్చా?*


*◼️వినియోగించొచ్చు. రూ.2వేల నోటును సాధారణ లావాదేవీలకు ప్రజలు ఉపయోగించుకోవచ్చు. వాటిని స్వీకరించవచ్చు కూడా. అయితే, 2023 సెప్టెంబర్‌ 30లోగా ఆ నోట్లను బ్యాంకులో డిపాజిట్‌ చేయడం లేదా మార్చుకోవడం చేయాలి.*


*💥4. రూ.2 వేల నోటు కలిగి ఉన్నవారు ఏం చేయాలి?*


*◼️రూ.2 వేల నోటు ఉన్నట్లయితే బ్యాంకుకు వెళ్లి వాటిని తమ అకౌంట్లో డిపాజిట్‌ చేయడమో లేదా మార్చుకోవడమో చేయాలి. అయితే, ఈ సదుపాయం 2023 సెప్టెంబర్‌ 30వరకు ఉంటుంది. అన్ని బ్యాంకు శాఖలతో పాటు దేశవ్యాప్తంగా ఆర్‌బీఐకి ఉన్న 19 ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకోవచ్చు.*


*💥5. బ్యాంకు అకౌంట్లో డిపాజిట్‌ చేసుకోవడంపై ఏదైనా పరిమితి ఉందా?*


*◼️బ్యాంకు అకౌంట్లో డిపాజిట్‌ చేసుకోవడంపై ఎటువంటి ఆంక్షలూ లేవు. కేవైసీ, ఇతర నిబంధనలను అనుసరించి వాటిని డిపాజిట్‌ చేసుకోవచ్చు.*


*💥6. రూ.2 వేల నోటు మార్చుకునేందుకు ఏమైనా పరిమితులు ఉన్నాయా?*


*◼️ప్రజలు ఒకేసారి రూ.20వేలు మాత్రమే మార్చుకునే అవకాశం ఉంటుంది.*


*💥7. ఈ నోట్లను బిజినెస్‌ కరెస్పాండెంట్‌ (బీసీ)లతో మార్చుకోవచ్చా?*


*◼️మార్చుకోవచ్చు. అయితే, బ్యాంకుల్లో ఉండే బిజినెస్‌ కరెస్పాండెంట్‌ల నుంచి రోజుకు కేవలం రూ.4వేలు మాత్రమే మార్చుకోవచ్చు.*


*💥8. ఏ తేదీ నుంచి నోట్లను మార్చుకునే అవకాశం అందుబాటులో ఉంటుంది?*


*◼️2023 మే 23 నుంచి మాత్రమే ఈ నోట్లను మార్చుకునే వీలుంటుంది. ప్రజలకు అసౌకర్యం కలగకుండా బ్యాంకులు ఏర్పాట్లు చేసుకునేందుకు ఈ గడువు ఇవ్వడం జరిగింది.*


*💥9. అకౌంటు ఉన్నవారు అదే బ్రాంచీలో మార్చుకోవాలా?*


*◼️లేదు. ఏ బ్యాంకులోనైనా రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చు. అయితే, ఒక బ్రాంచీలో ఒకేసారి రూ.20వేలు మాత్రమే మార్చుకోవడానికి వీలుంటుంది.*


*💥10. ఎవరికైనా రూ.20వేలకంటే ఎక్కువ అవసరమైతే ఏం చేయాలి?*


◼️డిపాజిట్‌పై ఆంక్షలు లేవు. రూ.2వేల నోట్లు ఎన్ని ఉన్నా తమ అకౌంట్లో డిపాజిట్‌ చేయవచ్చు. అనంతరం తమ అవసరానికి అనుగుణంగా వాటిని విత్‌డ్రా చేసుకోవచ్చు.


💥11. నోట్లను మార్చుకోవడానికి అదనంగా ఏమైనా చెల్లించాలా?


◼️లేదు. నోట్ల మార్పిడి పూర్తిగా ఉచితం


💥12. వయోవృద్ధులు, వికలాంగుల కోసం బ్యాంకుల్లో ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయా?


◼️వయోవృద్ధులు, వికలాంగులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తగు ఏర్పాట్లు చేసుకోవాలని బ్యాంకులకు సూచించాం.


💥13. తక్షణమే రూ.2వేల నోటును డిపాజిట్‌ చేయకుంటే ఏమవుతుంది?


◼️ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా నాలుగు నెలల సమయం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన గడువులోగా వాటిని డిపాజిట్‌ చేయడమో లేదా మార్చుకోవడమే చేయాలని సూచిస్తున్నాం.


💥14. రూ.2వేల నోటును తీసుకునేందుకు బ్యాంకు నిరాకరిస్తే ఏం చేయాలి..?


◼️సేవల్లో ఏదైనా లోపం జరిగితే వినియోగదారుడు తొలుత బ్యాంకు అధికారులను సంప్రదించాలి. ఫిర్యాదు చేసిన 30 రోజుల్లోగా బ్యాంకు స్పందించకపోవడం లేదా బ్యాంకు ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందకపోతే రిజర్వు బ్యాంకు-ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌మెన్‌ స్కీమ్‌ (RB-IOS), 2021 కింద ఆర్‌బీఐకి ఫిర్యాదు చేయవచ్చు.

--------------------------------------------------------------

రిక్వెస్ట్ స్లిప్ ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ 2000/- నోట్స్ @బ్యాంక్



0 comments

Comments


bottom of page