top of page
Writer's pictureAP Teachers TV

రూ.10వేలు చెల్లిస్తే రక్షిస్తాం.. కళ్లముందే కొట్టుకుపోయిన ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌

నదిలో కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని కాపాడాలంటే డబ్బులు చెల్లించాల్సిందే అని డైవర్లు మొండికేసిన ఘటన యూపీలో చోటు చేసుకొంది. వారికి సొమ్ములు ఇచ్చేసరికి బాధితుడు గంగానదిలో గల్లంతయ్యాడు.   


కాపాడగలిగి కూడా ఓ వ్యక్తి ప్రాణాలను ప్రమాదంలో పడేసిన ఘటన యూపీలో చోటు చేసుకొంది. అది కూడా ఓ ఉన్నతాధికారికి ఈ పరిస్థితి రావడం గమనార్హం. యూపీలోని ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆదిత్య వర్థన్‌ సింగ్‌ శనివారం బిల్‌హౌర్లోని నానమౌ వద్ద గంగానది ఘాట్‌లో సూర్యుడిని ఆరాధిస్తూ పుణ్యస్నానానికి దిగాడు. తన స్నేహితులు ఫొటోలు తీస్తుండటంతో కొంత దూరం నదిలోకి వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన వార్నింగ్‌ మార్క్‌ను కూడా దాటేశాడు. అతడికి ఈత బాగానే వచ్చినా..ప్రవాహం తీవ్రంగా ఉండటంతో తట్టుకొలేక నదిలో కొట్టుకుపోయాడు. 



ఈ ఘటనను ప్రత్యక్షంగా చూస్తున్న ఆదిత్య మిత్రులు అక్కడే ఉన్న  ప్రైవేటు గజఈతగాళ్ల వద్దకు వెళ్లి.. ఆదిత్యను రక్షించాలని కోరారు. వారు రూ.10,000 చెల్లిస్తేగానీ నదిలోకి దిగమని మొండికేశారు. తమ వద్ద అంతమొత్తం నగదు రూపంలో లేదని చెప్పినా వినలేదు.. యూపీఐలో చెల్లించాలన్నారు. దీంతో అతడి మిత్రులు చెల్లింపులు చేసేసరికి.. ఆదిత్య ప్రవాహంలో గల్లంతైపోయాడు. 

ఆదివారం కూడా గాలింపును కొనసాగించారు. కానీ, ఇప్పటి వరకు ఆదిత్య ఆచూకీ లభించలేదని బిల్‌హర్‌ ఏసీపీ అజయ్‌ కుమార్‌ వెల్లడించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, ఫ్లడ్‌ యూనిట్‌, పోలీసులు, ప్రైవేటు డైవర్స్‌ కూడా రంగంలోకి దిగారు. మరోవైపు డైవర్లు డబ్బు డిమాండ్‌ ఆరోపణలపై డీసీపీ సింగ్‌ స్పందిస్తూ.. ఈ విషయంలో ఈతగాళ్ల వాదన భిన్నంగా ఉందని పేర్కొన్నారు. తాము కేవలం స్టీమర్‌ ఇంధనం కోసం డబ్బులు అడిగామని చెబుతున్నట్లు తెలిపారు. దీనిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకొంటామని చెప్పారు.


ఇవి కూడా చదవండి :

Follow


0 comments

Recent Posts

See All

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....

Comments


bottom of page