top of page
Writer's pictureAP Teachers TV

మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక జీవోలు





మహిళా ఉద్యోగుల కోసం

ప్రత్యేక జీవోలు

రాష్ట్రంలో మహిళలు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.

వారి కోసం ప్రభుత్వాలు ఎన్నో రాయితీలు కల్పించడమే కాకుండా

సౌకర్యాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారి కోసం ప్రభుత్వం అమలు

చేస్తున్న సౌకర్యాలకు సంబంధించి జీవోల వివరాలు..


1 మహిళా ఉద్యోగులకు 5 సీఎల్ లు అధికం. (జీవో.

ఎంఎస్.నెం.374, ఈడీఎన్,

తేది 16-3-1996)

2. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటే 14 రోజులు సెలవు ఇస్తారు.

(జీవో.ఎంఎస్.నెం.1415, ఎంఅండెచ్, తేది 10-06-1968)

3. మొదటి ఆపరేషన్ ఫెయిల్ అయిన రెండవ ఆపరేషన్కు కూడా 14 రోజులు

సెలవు ఇస్తారు (జీవో. ఎంఎస్.నెం.124, ఎఫ్ఎండ్, తేది 13-04-1982)

4. లూప్ వేయించుకున్న రోజు స్పెషల్ సీఎల్ ఇస్తారు. (జీవో ఎంఎస్.నెం.128,

ఎఫ్ఎండ్పీ, తేది 13-04-1982)

5. ఆపరేషన్ తరువాత పిల్లలు చనిపోతే రికానలైజేషన్ చేయించుకున్న ఉద్యోగికి

21 రోజులు సెలవు ఇస్తారు. (జీవో ఎంఎస్.నెం. 102, ఎం అండ్చ్, తేదీ

19-02-1981)



6. గర్భసంచి తొలగింపు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు సివిల్ అసిస్టెంట్ సర్జన్

సిఫార్సు మేరకు 45 రోజులు ప్రత్యేక సెలవు ఇస్తారు. (జీవో. ఎంఎస్.నెం.52,

ఎఫ్ఎస్ఐఎన్, తేది 01-04-2011)

7. 180 రోజులు ప్రసూతి సెలవులు ఇస్తారు. ఇది ఇద్దరు జీవించియున్న పిల్లలకు

మాత్రమే వర్తిస్తుంది. (జీవో. ఎంఎస్.నెం. 152, ఎఫ్ ఐఎన్, తేది 04-05-2010),

(జీవో.ఎంఎస్ .నెం. 38, ఎఫండ్ పి, తేది 13-08-1992)

8. సమ్మర్ హాలిడేస్లో ప్రసవించిన, ఇక్కడి నుండి 180 రోజులు ఇస్తారు.

(జీవో. ఎంఎస్.నెం. 762, ఈడీఎన్, తేది 04-05-1979)

9. అబార్షన్ అయితే ఆరువారాలు సెలవు ఇస్తారు. (జీవో ఎంఎస్.నెం.762, ఎఫ్

sod 3, 36 11-08-1976)

10. వివాహం కొరకు రూ. 75 వేలు అప్పుగా ఇస్తారు. దీనిని 70 వాయిదాలలో

తిరిగి 5.50 శాతం వడ్డీతో సహా చెల్లించాలి. (జీవో ఎంఎస్.నెం.39, ఎఫ్ఎండ్పి, తేదీ

15-04-2015)

11. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సబార్డినేట్

సర్వీసు రూల్సులోని నిబంధన 22 ద్వారా వెసలుబాటు కల్పించినది.

(జీవో.ఎంఎస్.నెం.237, జీఏడీ, తేది 28-05-1996)

12. ఉద్యోగకల్పనకు సంబంధించి మహిళల పట్ల అమలవుతున్న వివక్షను

నిర్మూలించడానికి, ఉద్యోగ కల్పనలో సమానత్వం సాధించడానికి ఉద్దేశించిన

మార్గదర్శకాలు (జీవో

ఎంఎస్. నెం. 27. తేది 09-01-2004)



13. మరణించిన ప్రభుత్వ ఉద్యోగి వివాహిత కుమార్తెకు కారుణ్య నియామక

పథకం ద్వారా ఉద్యోగం కల్పిస్తారు. (జీవో. ఎంఎస్.నెం. 350, తేది 30-07-1999)

14. అవివాహిత ప్రభుత్వ ఉద్యోగి మరణించిన సందర్భంలో ఆ ఉద్యోగి మీద

ఆధారపడిన చెల్లెలుకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగ అవకాశం. (మెమో

30.17897, 38 20-04-2000)

15. పనిస్థలాల్లో మహిళా ఉద్యోగుల పట్ల లైంగిక వేధింపులను నిషేధిస్తూ

ఉత్తర్వులు. (జీవో.ఎంఎస్ . నెం. 322, జీఏడీ, తేది 19-07-1995).

16. ఎస్ఎస్సి సర్టిఫికెట్లలో తండ్రి పేరుతో పాటు తల్లి పేరు చేర్చు ఉత్తర్వులు.

(353 30.7679 38 14-09-2010)

19. మహిళా ఉద్యోగులకు సర్వీసులో 60 రోజులు శిశు సంరక్షణ సెలవు

మంజూరు. (జీవో.ఎం.ఎస్.నెం. 132, తేది 06-07-2016)



0 comments

Recent Posts

See All

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....

Comments


bottom of page