మంకీపాక్స్ నిర్ధారణ కిట్ వచ్చేసింది. ఏపీ మెడ్‌టెక్ జోన్ ఘనత.Monkeypox
ఏపీ టీచర్స్ టీవీ , విశాఖపట్నం: విశాఖలోని ఏపీ మెడ్‌టెక్ జోన్ (ఏఎంటీజెడ్) మరో ఘనత సాధించింది. తమ భాగస్వామి ట్రాన్సేషియా డయాగ్నస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎంపాక్స్ (మంకీపాక్స్) వ్యాధి నిర్ధారణకు ఆర్టీ-పీసీఆర్ కిట్‌ను ఉత్పత్తి చేసింది. ఎర్బాఎండీఎక్స్ మంకీపాక్స్ ఆర్టీ-పీసీఆర్ పేరిట కిట్‌ను అభివృద్ధి చేసింది. ఎంపాక్స్ నిర్ధారణకు దేశీయంగా రూపొందించిన తొలి టెస్టింగ్ కిట్‌ను ఇదేనని శనివారం ప్రకటించింది.
దీనికి ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చి (ఐసీఎంఆర్) ధ్రువీకరణతో పాటు కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి అత్యవసర అనుమతులు మంజూరయ్యాయి. ప్రపంచ ఆరోగ్య ఆవిష్కరణల్లో భారతదేశం ముందంజలో ఉందనే విషయాన్ని ఇది ప్రతిబింబిస్తోందని మెడ్‌టెక్ జోన్ సీఈఓ డా.జితేంద్ర శర్మ పేర్కొన్నారు. ఆరోగ్యరంగంలో భారతదేశ ప్రతిభకు ఇదే తార్కాణమన్నారు. ఇది రెండు వారాల్లో మార్కెట్లలోకి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కొవిడ్ విపత్తు సమయంలో మెడ్‌టెక్ జోన్ ఆరోగ్యరంగానికి అవసరమైన అనేక ఆవిష్కరణలు చేసింది. రోజుకు ఒక మిలియన్ ఆర్టీపీసీఆర్ కిట్లు, 500 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 100 వెంటిలేటర్లు ఇక్కడ తయారయ్యాయి.
ఇవి కూడా చదవండి :
ఏపీ టీచర్స్ టివి:
Whatsapp Channel : https://bit.ly/APTTVWAChannel
Recent Posts
See Allఈనెలలోనే మెగా డిఎస్సీ Mega DSC నోటిఫికేషన్ ప్రకటిస్తాం! కెజి టు పిజి పాఠ్య పుస్తకాల్లో మార్పులు పాఠశాలల్లో వార్షికోత్సవాలను నిర్వహిస్తాం...
ఈరోజు కమిషనర్ కార్యాలయంలో ఉపాధ్యాయ సంఘాల సమావేశం జరిగింది. 1. అన్ని కేడర్ల సీనియారిటీ లిస్టులో ఫైనలైజ్ అయ్యాయి ఎన్నికల కోడ్ అవగానే...
కోడ్ తర్వాత టీచర్ల ప్రాథమిక సీనియారిటీ జాబితా విడుదల అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి...
Comments