బదిలీ ఉత్తర్వులు కోరుతూ సీఎంకి ఎమ్మెల్సీ లక్ష్మణరావు లేఖ..

బదిలీ ఉత్తర్వులు కోరుతూ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ లక్ష్మణరావు లేఖ రాశారు.
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖలో రెండులక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. సదరు ఉపాధ్యాయుల బదిలీలు చేపడతామని అధికారులు, సంబంధిత మంత్రులు వేసవి సెలవుల నుండి అనేక పర్యాయాలుగా ప్రకటిస్తున్నారు. కానీ నేటికీ సంబంధిత ఉత్తర్వులు విడుదల కాలేదు. సంబంధిత పైలు ముఖ్యమంత్రి గారి ఆమోదం పొందినందున బదిలీల ఉత్తర్వులు జారీ చేయుటకు తగిన చర్యలు తీసుకోవలసినదిగా కోరుతున్నాము. అని శాసనమండలి సభ్యులు కేఎస్ లక్ష్మణరావు గారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు
Comments