బిగ్ బ్రేకింగ్.. ఉద్యోగుల పే స్లిప్పులతో సహా సమస్త సమాచారంతో ఫైనాన్స్ శాఖ కొత్త యాప్ "నిధి "
Updated: Nov 10, 2023
బిగ్ బ్రేకింగ్.. ఉద్యోగుల పే స్లిప్పులతో సహా సమస్త సమాచారంతో ఫైనాన్స్ శాఖ"నిధి " కొత్త యాప్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిధి పేరుతో కొత్త యాప్ రూపొందించింది. ఈ యాప్ లో ఉద్యోగుల శాలరీ స్లిప్ తో పాటు ఏపీజీఎల్ఐ జిపిఎఫ్ సిపిఎస్ తదితర వివరాలన్నిటిని అలాగే వ్యక్తిగత వివరాలు వృత్తి గత వివరాలు సర్వీసు వివరాలు అన్నిటిని ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఉద్యోగి లీవ్ మేనేజ్మెంట్ సెక్షన్ కూడా ఈ యాప్ లో చేర్చారు. ఉద్యోగి తన బ్యాంకు వివరాలను ఇక్కడ చూసుకోవచ్చు ఎడిట్ చేసుకోవచ్చు. ఉద్యోగి తమ వివరాలను ఇక్కడ ఎడిట్ చేయవచ్చు అప్డేట్ చేయవచ్చు. సిపిఎస్ ఉద్యోగులు తమ సిపిఎస్ అకౌంట్ యొక్క వివరాలను చెక్ చేసుకోవచ్చు. పెన్షనర్లు తమ ఈకేవైసీని తమ సి ఎఫ్ ఎం ఎస్ ఐ డి ఇచ్చి ఇక్కడే పూర్తి చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఉన్నటువంటి హెర్బ్ యాప్ ని పూర్తిగా మార్చివేసి కొత్తగా డిజైన్ చేయడం జరిగింది అందుకే ఈ యాప్ HERB కి అప్డేట్గా వచ్చినప్పటికీ కొత్త యాప్ అని పేర్కొన్నాము. ఉద్యోగి తన సర్వీసు కాలంలో ఎప్పుడైనా ఈ వివరాలను చెక్ చేసుకుని సదుపాయం ఉంటుందని ప్లే స్టోర్లో పేర్కొనడం జరిగింది.
ఈ క్రింది స్క్రీన్ షాట్స్ చూస్తే యాప్ లోపల సౌకర్యాలు అన్ని గమనించవచ్చు. ఇక పేస్లిప్ డౌన్లోడ్ చేసుకోవడం మరింత ఈజీ చేశారు. ముందటి HERB యాప్ కంటే ఈ "నిధి " యాప్ యూజర్ ఇంటర్ఫేస్ బాగుంది. ఈ యాప్ పై ఈ పోస్టుపై మీ అభిప్రాయాలను ఈ పోస్టు కింద కామెంట్ చేయండి ఈ పోస్టు నచ్చితే కిందనున్న హృదయం గుర్తుపై నొక్కి లైక్ చేయండి. ఇలాంటి మరింత తాజా సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి.
పూర్తి వివరాలకు ఈ కింది వీడియో చూడవచ్చు
శాలరీ బిల్ ప్రిపేర్ చేసే పే రోల్ వెబ్ సైట్ Address మార్చడం జరిగింది, కొత్త పే రోల్ సైట్ address link...
👇👇
Commentaires