top of page
Writer's pictureAP Teachers TV

ఫేషియల్ అటెండెన్సా? జాగ్రత్త మాస్టారు!




జాగ్రత్త మాస్టారు!

ఫేషియల్ అటెండెన్స్ యాప్ ని ఒక గట్టి హ్యాకర్ తో చెక్ చేయించడం మంచిది. వాళ్ల దగ్గర ఉన్న సెక్యూరిటీ టూల్స్, ఫైర్ వాల్,అన్ని ఏంటి వైరస్ ఏంటి మాల్ వేర్ స్కానింగ్ సాఫ్ట్వేర్ లతో స్కానింగ్ చేయించాలి. ఏ లోపము లేకపోతే ఓకే! లేదంటే ఆ మధ్య దేశవ్యాప్తంగా దుమారం రేపిన "పెగాసస్" సాఫ్ట్వేర్ గుర్తుందిగా ! ప్రశాంత్ కిశోర్ "ఐ-ప్యాక్" టీమ్ ఇలాంటి సాంకేతిక సాధనాలే వాడుతోందట.

చాలా మందికి తెలియని విషయం ఏంటంటే! మన ఫోన్లోని యాప్స్ ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి. అవును మీరు విన్నది నిజమే యాప్స్ ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవుతాయి. డేటా షేర్ చేసుకుంటాయి. మనం దైనందిన అవసరాలకు కొన్ని ఆన్లైన్ పేమెంట్ యాప్స్, ఆన్లైన్ షాపింగ్ యాప్స్, చాటింగ్ వీడియో కాలింగ్, పర్సనల్ మెసేజ్ , మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ వాడుతుంటాము. ఇలాంటి కొన్ని యాప్స్ కొన్ని వేరే యాప్స్ తో సమాచారం పంచుకుంటాయి. కొన్ని ఆప్స్ సమాచారాన్ని సేకరించి వారి యజమానులకు చేరవేస్తాయి.

ప్లే స్టోర్ లో అప్లోడ్ అయ్యే యాప్స్ ని ప్లే స్టోర్ స్కాన్ చేసి పెడుతుంది. గూగుల్ పర్యవేక్షణలో ఎప్పుడైనా ఏవైనా యాప్స్ లోని లోపాలు తారసపడితే ఆ యాప్స్ ని గూగుల్... ప్లే స్టోర్ నుంచి డిలీట్ చేస్తుంది కూడా. మనం ప్లే స్టోర్ నుంచి ఈ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మన ఫోన్ లో ఉన్న డిఫాల్ట్ స్కానర్ వాటిని స్కాన్ చేసి అవి సేఫా కాదా చెబుతుంది. అప్పుడు మనం వాటిని ఉంచుకోవాలా రిమూవ్ చేయాలా అనేది నిర్ణయించుకోవచ్చు. అయినప్పటికీ ఇన్ని దశలుగా సెక్యూరిటీ అమలుపరిచిన ప్పటికీ అవి 100% సేఫ్ అని చెప్పలేము. ఒక్కోసారి థర్డ్ పార్టీ సైబర్ సెక్యూరిటీ సంస్థలు ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ లలో ఉన్న కొన్ని యాప్స్ సురక్షితమైనవి కావని హెచ్చరిస్తుంది. ఆ సూచనలు పాటించి గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ వాటిని తమ ప్లాట్ఫారాల నుంచి రిమూవ్ చేస్తాయి.

మనం కొన్ని యాప్స్ ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి కాకుండా కొన్ని వెబ్సైట్లో దొరికే APK రూపంలో డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటాము. APK అంటే ఆండ్రాయిడ్ ప్యాకేజ్ ఫైల్. ఇవి చాలా ప్రమాదకరం. వీటిని డౌన్లోడ్ చేసుకునేటప్పుడే "ఇవి మీ డివైస్ కి ప్రమాదకరం కంటిన్యూ ఎనీవే? " అని అడుగుతాయి. మనం ఏదైనా ఏపీకే డౌన్లోడ్ చేసుకోవాలంటే సంబంధిత వెబ్సైట్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవడం క్షేమకరం. ఎందుకంటే రకరకాల వెబ్సైట్లో మాడిఫై చేసిన ఏపీకేలు ఉంటాయి. అంటే ఒరిజినల్ ఏపీకే లకు రకరకాల మార్పులు చేసి వెబ్సైట్లో ఉంచుతారు. ఇంతకుముందు చెప్పినట్లుగా వేరే యాప్స్ తో ఇంటరాక్ట్ అయ్యేలాగా సంభాషణలు జరిపి సమాచారం సేకరించేలాగా, మరికొన్ని డైరెక్ట్ గా బ్యాంకు సమాచారాన్ని, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేలాగా, యూజర్నేమ్, పాస్వర్డ్ తస్కరించేలాగా ఈ APKలకు మార్పులు చేసి ఆన్లైన్ ప్రపంచంలోకి వదులుతారు. వీటిలో వైరస్లు, మాల్ వేర్లు, ఫిషింగ్ ఫైల్స్ రకరకాల బగ్స్ ఉండవచ్చు. ప్రీమియం యాప్స్ ని అన్లాక్ చేసి, వివిధ యాప్స్ యొక్క ప్రో వెర్సన్స్ ని అన్ లాక్ చేసి పూర్తి ఫ్రీగా వాడుకునేలా కూడా ఈ APK లను మోడిఫై చేస్తారు. ఇవి కొన్ని సేఫ్. కొన్ని అన్ సేఫ్!

ఇక మనం ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన వెంటనే వివిధ పర్మిషన్లు అడుగుతుంది. సరిగ్గా ఈ సమయంలోనే మనం చాలా మెలకువగా వ్యవహరించాలి. లేదంటే డేటా , ప్రైవసీ తస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. ఒక యాప్ మనం ఎందుకు వాడతామో అందుకు తగిన పర్మిషన్లు మాత్రమే ఇవ్వాలి అదనపు పర్మిషన్లు ఇవ్వకూడదు. మనం వాడుతున్న ఫేషియల్ అటెండెన్స్ యాప్ కి కెమెరా, స్టోరేజ్, లొకేషన్ పర్మిషన్లు మాత్రమే ఇస్తే సరిపోతుంది. వీడియో, కాల్స్, మెసేజెస్ ఆడియో రికార్డింగ్ లాంటి పర్మిషన్లు అడిగితే అనుమానించాల్సిందే! ఎందుకంటే మన అటెండెన్స్ కి ఈ అదనపు పర్మిషన్లకి సంబంధం లేదు. మరి మన ఫేషియల్ అటెండెన్స్ యాప్ ఈ అదనపు పర్మిషన్లు అడుగుతుందే! ఎందుకోసం ఈ అదనపు పర్మిషన్లు? సమాధానం లేని ప్రశ్న. నీటిలోకి దూకే ముందు లోతు ఎంతో తెలుసుకోవాలి . అక్కడ రాళ్ళూరప్పలు ఉన్నాయేమో చూసుకోవాలి. అలాగే యాప్స్ వాడే ముందు దాని భద్రత, పర్మిషన్లు వంటివి తప్పనిసరిగా పరిగణించాలి. అందుకే మన ఉపాధ్యాయులు వాడుతున్న యాప్స్ ని మన సంఘాలు సైబర్ సెక్యూరిటీ నిపుణులతో చెక్ చేయించడం చాలా ఉత్తమం.

కొన్ని ప్రభుత్వ వెబ్సైట్లు ఓపెన్ చేసినప్పుడు వాటి అడ్రస్ బార్ మొదట్లో "నో సెక్యూర్" అని కనిపించడం గమనించారా? ఒకప్పుడు సీఎస్ఈ వెబ్ సైట్, స్టూడెంట్ ఇన్ఫో వెబ్ సైట్ లో ఇలాగే నో సెక్యూర్ అని కనిపించేది. ఔరా! లక్షల మంది పిల్లల ఆధార్ నంబర్లు వారి తల్లిదండ్రుల ఆధార్ నంబర్లు బ్యాంకు ఎకౌంటు డీటెయిల్స్ వారి మార్కుల వివరాలు వేల మంది ఉపాధ్యాయుల సమాచారం ఇలా తలుపులు వేయకుండా ఓపెన్ గా ఉంచేసారే అని ఆశ్చర్య పోవడం జరిగింది. హ్యాకర్లకి ఇలాంటి వెబ్ సైట్లే లోకువ.మరి ఏ వెబ్సైట్ అయినా సెక్యూరా కాదా అని ఎలా కనిపెట్టాలి? వెబ్ అడ్రస్ ప్రారంభంలో http:// కి బదులుగా https:// అని ఉంటే అది సురక్షితమైన వెబ్ సైట్ అన్నమాట.

ఇక స్కూల్లోనూ ఇంట్లోనూ ఎన్నో పనులు సాంకేతిక సహకారంతోనే చేసుకోవలసిన రోజులొచ్చిన తరుణంలో మన ఉపాధ్యాయులం తప్పనిసరిగా టెక్నాలజీ మీద అవగాహన, పట్టుసంపాదించవలసిన అవసరం ఉంది. మీకు ఏ సాంకేతిక సహకారం కావాలన్నా మన apttv.co.in వెబ్ సైట్ మరియు www.youtube.com/apteacherstvtelugu మీకు అండగా ఉంటుంది.


ఈ పోస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.ఈ పోస్ట్ పై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ చేయండి.

తాజా పోస్ట్ లు మిస్ కాకుండా అప్ డేట్స్ పొందడానికి సబ్ స్క్రైబ్ చేసుకోండి.

0 comments

Recent Posts

See All

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....

Comentarios


bottom of page