top of page
Writer's pictureAP Teachers TV

పిల్లల్ని కొడుతున్నారా?జాగ్రత్త! ఇదిచదవండి

పిల్లల్ని కొడుతున్నారా?



క్రమశిక్షణ కోసం లేదా శిక్షించటం కోసం....దేనికోసమైనా పిల్లల్ని కొట్టడం అనేది పెంపకంలో భాగమైపోయింది. తక్షణ ఫలితం రాబట్టడం కోసం కొడుతున్నామని అంటున్నారా? అయితే వెంటనే ఆ పని మానుకోండి. దెబ్బ చిన్నదైనా, పెద్దదైనా అది పిల్లల మనసు మీద శాశ్వత ప్రభావం చూపిస్తుంది. కాబట్టి పిల్లల్ని కొట్టేముందు ఈ కింది విషయాల గురించి ఆలోచించండి క్రమశిక్షణ కోసం లేదా శిక్షించటం కోసం....దేనికోసమైనా పిల్లల్ని కొట్టడం అనేది పెంపకంలో భాగమైపోయింది. తక్షణ ఫలితం రాబట్టడం కోసం కొడుతున్నామని అంటున్నారా? అయితే వెంటనే ఆ పని మానుకోండి. దెబ్బ చిన్నదైనా, పెద్దదైనా అది పిల్లల మనసు మీద శాశ్వత ప్రభావం చూపిస్తుంది. కాబట్టి పిల్లల్ని కొట్టేముందు ఈ కింది విషయాల గురించి ఆలోచించండి.



సంప్రదాయాల్ని పాటించడం: పిల్లల్ని కొట్టడం అనేది మీ ఇంట్లో సంప్రదాయంగా వస్తోందా? మీ నాన్నని మీ తాతయ్య, మిమ్మల్ని మీ నాన్న మందలించటానికి అదే పద్ధతిని అనుసరించారు కాబట్టి మీరూ దాన్నే ఫాలో అవుతున్నారా? అలాగైతే పెద్దయ్యాక మీ పిల్లలు కూడా తమ మాట వినేలా చేయటం కోసం వాళ్ల పిల్లల్ని ఇలానే దండిస్తారు.


వయసులో పెద్దవారైతే చాలా?: పిల్లలు మిమ్మల్ని ఎదిరించలేరు, బలహీనులని వాళ్లని కొట్టడానికి మీరు వెనకాడటం లేదా? ఇదే మీ ఉద్దేశమైతే పెరిగి పెద్దయ్యాక మీ పిల్లలు కూడా తాము చెప్పిందే కరెక్టని ఒప్పించటం కోసం కొట్టడాన్నే సాధనంగా వాడతారు.


అనుబంధాలకు బీటలు: పిల్లలకు మీకు మధ్య ఎంతటి అనుబంధమున్నా కొట్టడంతో ఆ బంధం బీటలు బారుతుంది. ఆ దూరం శాశ్వతంగా ఉండిపోతుంది.


రిలేషన్‌షిప్‌ సమస్యలు: తల్లితండ్రుల చేతుల్లో దెబ్బలు తింటూ పెరిగిన పిల్లలు తమ జీవితాల్లో రిలేషన్‌షిప్‌ సమస్యల్ని ఎదర్కొంటారు. తమను కొట్టే తల్లితండ్రుల్ని నమ్మనట్టే ఎవర్నీ వాళ్లు నమ్మలేరు.



0 comments

Recent Posts

See All

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....

Comments


bottom of page