top of page
Writer's pictureAP Teachers TV

ప్రభుత్వ ఉద్యోగులకోసం వైఎస్సార్సీపీ మానిఫెస్టోలో ఏముంది?#ysrcpmanifesto

ప్రభుత్వ ఉద్యోగులకోసం వైఎస్సార్సీపీ మానిఫెస్టోలో ఏముంది? #ysrcpmanifesto


ప్రభుత్వ ఉద్యోగులు

రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు ఇప్పటికీ పెంచాం

🔸 ఓపీఎస్ విధానానికి వెళ్లలేకపోయినా.. ఉద్యోగుల భద్రత,

భవిష్యత్తరాలు, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని.

పదవీ విరమణ చేయబోతున్న ఉద్యోగుల కోసం

గ్యారెంటీడ్ పెన్షన్ విధానం (జీపీఎస్) తీసుకొచ్చాం.

🔸 అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు, మునిసిపల్ పారిశుధ్య

కార్మికులు, హోంగార్డులు, 108, 104 వాహనాల డ్రైవర్లు,

ఆశా వర్కర్లు.. ఇలా వివిధ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను

గతానికి భిన్నంగా భారీగా పెంచాం. ఫలితంగా

3 లక్షలకుపైగా ఉద్యోగులకు లబ్ధి చేకూరింది.

🔸 ప్రభుత్వంలో ఏపీఎస్ ఆర్టీసీ విలీనం. ఏటా రూ.3,600

కోట్ల భారం. తద్వారా 52 వేల మందికి మంచి చేశారు.

కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్. తద్వారా

10 వేల మందికి మంచి చేశారు.

🔸 పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రతి జిల్లాలో ప్రత్యేక

సెల్ సైనికులు, మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి

ప్రతి జిల్లా కలెక్టరేట్ లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశాడు.



🔸పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చాం. అమలులో ఉన్న

చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తాం.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఆప్కాస్

కమీషన్లు, దళారీలు లేకుండా

జీతాలు, పీఎఫ్, ఈఎస్ఐ వారికి అందేలా చూస్తున్నాం.

వచ్చే 5 ఏళ్లలో.....

🔸 జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపిక కాని ప్రభుత్వ

ఉద్యోగుల పిల్లలు ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు వారు

తీసుకునే రుణంలో రూ.30 లక్షల వరకు.. పూర్తి వడ్డీని

కోర్సు పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా 5 ఏళ్లపాటు

చెల్లిస్తాం. #ysrcpmanifesto

🔸 రూ.25 వేల వరకు జీతం పొందే అప్కాస్, అంగన్ వాడీలు,

ఆశావర్కర్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలు

వైద్యానికి ఇళ్లకు ఇబ్బంది పడకూడదనే

ఉద్దేశంతో విద్య, వైద్యానికి, ఇళ్లకు సంబంధించిన

అన్ని నవరత్న పథకాలూ వారికీ వర్తింపు.

🔸 ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు తమ సొంత జిల్లాలోనే

ఇళ్ల స్థలాలు. 60 శాతం ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది.




0 comments

Comentarios


bottom of page