ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే రూల్స్ మాకు ఇవ్వాల్సిందే..
ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే రూల్స్ మాకు ఇవ్వాల్సిందే..
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు సోమవారం సమావేశం నిర్వహించారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేలా పాలకులకు విజ్ఞాపన పత్రాలు అందచేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షులు తోటకూర కోటేశ్వరరావు మాట్లాడుతూ...
విజయవాడ, ఆగస్టు 5: గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు (Secretariat Employees) సోమవారం సమావేశం నిర్వహించారు. తమ సమస్యలను ప్రభుత్వం (AP Government) పరిష్కరించేలా పాలకులకు విజ్ఞాపన పత్రాలు అందచేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షులు తోటకూర కోటేశ్వరరావు మాట్లాడుతూ... కొన్ని సమస్యలను సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకు వెళ్లామని తెలిపారు
సచివాలయ ఉద్యోగులకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలన్నారు. సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ ఆలస్యంగా చేసినందువలన రావలసిన బకాయిల్ని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ అయిన నాటి నుంచి జూనియర్ అసిస్టెంట్ పేస్కేల్ కల్పించాలన్నారు.
సచివాలయ ఉద్యోగులకు పదోన్నతి ఛానల్ క్రియేట్ చేసి, పదోన్నతులు కల్పించాలని అన్నారు. సచివాలయ ఉద్యోగులకు బదిలీలు చేపట్టాలని.. సచివాలయ ఉద్యోగులకు ఏకరూప దుస్తులు(యూనిఫామ్) విధానాన్ని రద్దు చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్న రూల్స్ అన్నీ కూడా, సచివాలయ ఉద్యోగులకు కచ్చితంగా వర్తించేలా చూడాలని.. సమస్యలపై, ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ వేసి, సమస్యలన్నీ వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని కోటేశ్వరరావు వినతి చేశారు.
Recent Posts
See Allనేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....
Comments