ప్రధానమంత్రి ఇ-విద్య ఛానల్ లో ప్రారంభ సన్నాహాలు
ప్రధానమంత్రి ఇ-విద్య ఛానల్ లో ప్రారంభ సన్నాహాలు
- ఏపీ పాఠశాల విద్యకు 5 డీటీహెచ్ ఛానెళ్లు
- పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ ఎస్ సురేష్ కుమార్ గారు
ప్రధానమంత్రి ఇ- విద్య ఛానల్ ను ప్రారంభించేందుకు అవసరమైన ఇ- కంటెంటును వెబ్సైటుకు పంపే ప్రక్రియ పాఠశాల విద్యాశాఖ కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు ప్రారంభించినట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి.ప్రతాప్ రెడ్డి గారు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం అందరికీ సమాన విద్యా అవకాశాలు అందుబాటులో ఉంచే ప్రక్రియలో భాగంగా 200 డైరెక్ట్ –టు- హోమ్ ఛానళ్లను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పాఠశాల విద్య కోసం 5 ఛానెళ్లను కేటాయించినట్లు తెలిపారు. వీటిని 2023 - 24 విద్యా సంవత్సరానికి గాను 9, 8, 7,6 తరగతులకు ఒక్కో ఛానెల్ చొప్పున, 3,4, 5 తరగతులకు కలిపి ఒక ఛానల్ కేటాయించారని తెలిపారు.
ఇందులో భాగంగా ఎస్సీఈఆర్టీ, పాఠశాల విద్య కమిషనర్ (ఇన్ఫ్రా) ఆధ్వర్యంలో 6,7,8,9 తరగతులకు సంబంధించిన భాషా విషయాలకు ఇ- కంటెంట్ ను రూపకల్పన జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం 8వ తరగతికి సంబంధించి పూర్తయిన ఇ- కంటెంటును డీటీహెచ్ ఛానళ్లో ప్రసార నిమిత్తం కమిషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారి చేతుల మీదుగా సంబంధిత విభాగానికి పంపే ప్రక్రియ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి.ప్రతాప్ రెడ్డి గారితో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
Recent Posts
See Allనేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....
Comments