ప్రధానోపాధ్యాయులకు లీడర్ షిప్ ట్రైనింగ్, ఉపాధ్యాయులకు FLN ట్రైనింగ్ కార్యక్రమాలలో మార్పులు

రాష్ట్ర వ్యాప్తంగా HMs కు లీడర్ షిప్, ఉపాధ్యాయులకు FLN ట్రైనింగ్ కార్యక్రమాలు వివిధ కేంద్రాల్లో రెసిడెన్షియల్ పద్ధతిలో జరుగుతున్నాయి. వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల విజ్ఞప్తుల మేరకు శిక్షణకు హాజరయ్యేవారు ఎవరైనా వారి నివాస ప్రదేశం నుంచి ఉ.9:00 గంట.లకు హాజరై, సా.5:00 గం.లకు శిక్షణ ముగిశాక తిరిగి తమ నివాస ప్రాంతాలకు వెళ్లవచ్చు. శిక్షణ కేంద్రాలలో రాత్రి పూట ఉండాలని అనుకునేవారు సొంత పూచీకత్తుపై ఉండాలి. వీరికి అన్ని వసతులూ కల్పించడమైనది. ఇంటికి వెళ్లాలనుకుంటే ఎటువంటి షరతులు లేకుండా శిక్షణ సమయం ముగిశాక వెళ్లొచ్చు
ప్రస్తుతం జరుగుచున్న బ్యాచ్ శిక్షణా తరగతులు రెండు రోజులపాటు ఈ విధంగా నిర్ణయించడమైనది. తదుపరి బ్యాచ్ లకు సంబంధించిన శిక్షణ విధివిధానాలు తరువాత తెలియజేయడం జరుగుతుందని రాష్ట్ర పథక సంచాలకులు, సమగ్ర శిక్షా ఆంధ్రప్రదేశ్, అమరావతి వారు ప్రకటించారు.
ఈ పోస్టు నచ్చితే కిందనున్న గుండె గుర్తు మీద నొక్కి సపోర్ట్ చేయగలరు
Comentarios