top of page
Writer's pictureAP Teachers TV

ప్రిన్సిపల్ సెక్రెటరీ మరియు కమిషనర్ తో జరిగిన వెబ్ ఎక్స్ చర్చనీయాంశములు




ప్రిన్సిపల్ సెక్రెటరీ మరియు కమిషనర్ తో జరిగిన వెబ్ ఎక్స్ చర్చనీయాంశములు:

1.ప్రతి సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి ఐదు గంటలు వరకు వెబ్ఎక్స్ నిర్వహిస్తారు.

2. ఆ వారంలో జరిగిన ఎడ్యుకేషన్ అంశాలపై అన్ని విషయాలతో చర్చిస్తారు వాటిపై రివ్యూ ఉంటుంది తక్షణం చర్చించవలసిన అంశాలు యాడ్ చేస్తూ రివ్యూ చేస్తారు.

3. ప్రభుత్వం విద్యపై దృష్టి పెట్టి విద్యా ప్రగతి కోసం స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియూ టీచర్స్ ఇష్యూస్, సర్వీస్ మేటర్ ,అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ లో విద్యార్థులు లర్నింగ్ అవుట్ కమ్స్ మొదలగు అంశాలపై ప్రభుత్వం దృష్టిపెడుతుంది

4.ప్రతి అంశం ట్రాన్సరెన్స్ గా ఉండాలి ఇంటిగ్రేటెడ్ గా ఉండాలి విద్యా అంశాలు ఎప్పటికప్పుడు అప్డేట్ గా తెలుసుకుంటూ సమాచారం మన వద్ద ఉంచుకోవాలి. ఏ విషయము తెలియదు అనకూడదు తెలుసుకునే ప్రయత్నం చేయాలి.

5. రెగ్యులర్ రివ్యూలు మండల స్థాయిలో కూడా ఉండాలి. MDM కి సంబంధించి ప్రతి ఐటెం సూపర్వైజర్ చేయాలి విద్యార్థులకు అందవలసిన ప్రతి ఐటెం కూడా అందాలి వాళ్లందరూ తినేటట్లు చేయాలి.

6. ఇన్స్పెక్షన్లు పెంచి విద్యా ప్రగతికి ఎంఈ1&2లో టీచర్స్ ని గైడ్ చేస్తూ సలహాలు సూచనలు ఇవ్వాలి. అజమాయిషీ పద్ధతి తగ్గించాలి.

7. టీచర్ అటెండెన్స్ విషయంలో స్టూడెంట్స్ విషయంలో చాలా తక్కువ స్టేటస్ కనిపిస్తుంది కనుక దానిపై దృష్టి పెట్టి దాని పర్సంటేజ్ పెరిగేటట్టు చేయాలి రెగ్యులర్గా ఆబ్సెంట్ అవుతున్న టీచర్స్ ని గుర్తించి ఆ సమాచారాన్ని పై స్థాయి అధికారులు పంపించాలి.

8. వర్క్ ఎడ్జస్ట్మెంట్ 100% పూర్తిచేసి పాఠశాల సక్రమ విద్యాప్రగతికి కృషి చేయాలి .

9.school complex reorganization త్వరగా పూర్తిచేసి గ్రామ సచివాలయాలు,అంగన్వాడీలు ఆ క్లస్టర్ లో ఉండేటట్టు చేయాలి.

10.ప్రతి ఎంఈఓ ఒక హైస్కూల్ను దత్తత తీసుకొని 100% క్వాలిటీని మరియు రిజల్ట్ వచ్చేటట్టు చేయాలి స్టూడెంట్స్ ఏ సబ్జెక్టులో వీక్ గా ఉన్నారో ప్రత్యేకమైన తరగతులు నిర్వహించే చెయ్యాలి.

11. NAS సర్వే త్వరలో జరుగుతుంది కనుక విద్యార్థులందరికీ రీడింగ్ మరియు గణితము నందు నైపుణ్యాలు అందజేయాలి.

12. సీబీఎస్ఈ స్కూల్స్ విజిట్ చేసి అందు రెమిడీయల్ టీచింగ్ జరుగుతుందా లేదా తగిన సదుపాయాలు కలిగి ఉన్నాయా లేదో నోట్ చేసుకోవాలి.




13.ATTENDENCE NOT CAPTURED స్కూల్స్ గుర్తించి 100% అయ్యేటట్లు చూడాలి

14.ఎండిఎం ఇన్స్పెక్షన్ లో ఎడ్యుకేషన్ 3 levels లో జరగాలి 1) వెల్ఫేర్ అసిస్టెంట్ 2)హెడ్మాస్టర్ ఇన్స్పెక్షన్ 3)ఎస్ఎంసి చైర్మన్ ఇన్స్పెక్షన్ జరిగేటట్టు చేయాలి.

15. ప్రభుత్వం ఇస్తున్న ప్రతి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ పిల్లలకు అందేటట్టు చూడాలి .

16.ఆయా పనితీరుపై దృష్టి పెట్టి పాఠశాల పరిశుభ్రతపై పర్యవేక్షణ జరగాలి.

16. ప్రతి ఎంఈఓ మరియు ఉపాధ్యాయులు జిల్లా,రాష్ట్రస్థాయిలో ఇది నాది అనే ఫీలింగ్స్ తో, ఓనర్ షిప్ మేనేజ్మెంట్ తో,రెస్పాన్సిబులిటీ గా పని చేయాలి.

17. ఫీల్డ్ లెవల్లో పర్యవేక్షణ పెంచి మీ అంచనాలకు తగ్గట్టుగా అవగాహన కలిగి ఉండాలి.

18. టైప్ ఫోర్ హాస్టల్స్ మీద అవగాహన ఉండాలి

19.భవిత సెంటర్లను సందర్శించి యాప్ ద్వారా సి డబ్ల్యూ స్క్రీనింగ్ యాప్ నందు నమోదు అయ్యేటట్టు చూడాలి.

20. పియం స్కూల్స్ విధివిధానాలు తెలుసుకొని వాటి విషయాలపై అవగాహన కలిగి ఉండాలి 21.స్టూడెంట్స్ కిడ్స్ పంపిణీ పనితీరు చాలా బాగుంది ప్రతి విద్యార్థికి ప్రతి స్టూడెంట్ కిడ్స్ ఐటమ్ అందేటట్టు చూడాలి.

22. ఎస్ఎంసి ఎలక్షన్స్ కంప్లీట్ చేసి త్వరలోనే వారికి కమ్యూనిటీ ఆక్టివిటీస్ పై ట్రైనింగ్ నిర్వహించవలసి ఉంది.

23. ప్రతి పాఠశాలలో యూత్ అండ్ ECO క్లబ్స్ ఏర్పాటు చేయాలి

24.స్వర్ణాంధ్ర కార్యక్రమంలో విద్యార్థులు పోటీలు నిర్వహించి విజన్- 2047 పై డిబేటు,ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ నిర్వహించాలి.




0 comments

Recent Posts

See All

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....

Comments


bottom of page