పాఠశాలల్లో వ్యాయామ విద్య పేలవం!
విద్యార్థులకు ఆటపాటలు, వ్యాయామవిద్య అందిస్తేనే.. చదువులోనూ రాణిస్తారని, సమగ్ర అభివృద్ధి సాధిస్తారని వైద్య, విద్యారంగ నిపుణులు ఘోషిస్తున్నా.. ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు పెడచెవిన పెడుతున్నాయని ఐక్యరాజ్య సమితి (ఐరాస) పేర్కొంది.
విద్యార్థులకు ఆటపాటలు, వ్యాయామవిద్య అందిస్తేనే.. చదువులోనూ రాణిస్తారని, సమగ్ర అభివృద్ధి సాధిస్తారని వైద్య, విద్యారంగ నిపుణులు ఘోషిస్తున్నా.. ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు పెడచెవిన పెడుతున్నాయని ఐక్యరాజ్య సమితి (ఐరాస) పేర్కొంది. అత్యధిక మంది పాఠశాల విద్యార్థులు కనీస వ్యాయామ విద్యకు నోచుకోవడంలేదని వెల్లడించింది. నాణ్యమైన వ్యాయామ విద్యపై రూపొందించిన తొలి ప్రపంచవ్యాప్త నివేదికలో ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టింది. ‘గ్లోబల్ స్టేట్ ఆఫ్ ప్లే’ పేరుతో వెల్లడించిన ఈ నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది.
్య 58% దేశాలు మాత్రమే బాలికలకు వ్యాయామ విద్యను తప్పనిసరి చేశాయి. ప్రపంచవ్యాప్తంగా 7 శాతం పాఠశాలలు మాత్రమే బాలురు, బాలికలకు భేదం లేకుండా వ్యాయామ విద్యకు సమాన సమయాన్ని కేటాయిస్తున్నాయి.
మూడింట రెండొంతుల మంది మాధ్యమిక పాఠశాలల విద్యార్థులకు, సగానికిపైగా ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు వారానికి అవసరమైన కనీస వ్యాయామ విద్యను బోధించడంలేదు. మూడింట రెండొంతుల దేశాలు తమ విద్యా బడ్జెట్‌లో కనీసం 2% కూడా వ్యాయామ విద్యకు కేటాయించడం లేదు.
నిధుల లోటు, వ్యాయామవిద్య శిక్షణకు హాజరవడానికి ఉపాధ్యాయులకు సమయం కేటాయించకపోవడం వంటివి ఈ రంగంలో నైపుణ్యలేమికి కారణమవుతున్నాయని నివేదిక స్పష్టం చేసింది. ఈ క్రమంలో అన్ని దేశాలు వ్యాయామ విద్యకు నిధుల కేటాయింపును పెంచాలని యునెస్కో సూచించింది
Recent Posts
See Allనేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....
Comments