top of page
Writer's pictureAP Teachers TV

పాఠశాల స్థాయి నుంచే నైపుణ్య శిక్షణ Skill Development

రాష్ట్రంలో పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఉపాధి నైపుణ్యాలు అందించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఆరో తరగతి నుంచి ఉన్నత విద్య వరకు.. 

9-10ల్లో కోర్సుల ఎంపికకు ఐచ్ఛికాలు

యూజీలో అప్రెంటిస్‌షిప్‌తో లోతైన పరిజ్ఞానం


రాష్ట్రంలో పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఉపాధి నైపుణ్యాలు అందించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ కోర్సులను పాఠశాల నుంచి ప్రారంభించి, ఉన్నత విద్య వరకు కొనసాగించాలని ఆలోచన చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసింది. చదువు పూర్తికాగానే విద్యార్థులకు ఉద్యోగాలు లభించేలా వాటిని రూపొందించనుంది. ఆరో తరగతి నుంచే నైపుణ్య కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చి, వాటిని అంచెలంచెలుగా 6-8, 9-10, 11-12 తరగతులు, ఆ తర్వాత అండర్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయి వరకు కొనసాగించాలని నిర్ణయించింది. పరిశ్రమల అవసరాలు, అభ్యర్థుల నైపుణ్యాలకు మధ్య అంతరాలను తగ్గించేందుకు వీటిని తీసుకొస్తోంది. ఉన్నత విద్యలో ఒకేసారి నైపుణ్యాలు అందించడం కంటే పాఠశాల స్థాయి నుంచే అనుభవపూర్వక బోధన పద్ధతిలో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని భావిస్తోంది.

బడి నుంచే ఇలా..

  • 6-8 తరగతుల్లో వృత్తి విద్య/నైపుణ్య కోర్సులు, తరగతులను ప్రవేశపెడతారు. క్షేత్రస్థాయి సందర్శనలు, పని ఆధారిత అభ్యాసం, ఇతర ప్రాక్టికల్స్‌ ఉంటాయి. 

  • 9-10 తరగతుల్లో ఒకటి లేదా రెండు నైపుణ్య/వృత్తి విద్య కోర్సుల ఎంపికకు ఐచ్ఛికాలు ఇస్తారు. ఆయా పాఠశాలలకు సమీపంలోని నైపుణ్య కేంద్రాలను అనుసంధానం చేస్తారు. నైపుణ్య కేంద్రాల్లో తరగతులు, అనుభవపూర్వక సెషన్లు కలిపి నిర్వహిస్తారు. 

  • 11-12 తరగతుల్లో వృత్తి విద్య/నైపుణ్య కోర్సుల్లో లోతైన పరిజ్ఞానం అలవడేలా తర్ఫీదిస్తారు. ఎంపిక చేసుకున్న కోర్సుల్లో 50 శాతం వరకు కరిక్యులమ్‌కు సమయాన్ని కేటాయిస్తారు. అనుభవపూర్వక బోధన, ఉన్నతమైన ప్రాక్టికల్స్‌ మదింపునకు 20%-30% వెయిటేజీ ఉంటుంది. 

  • అండర్‌ గ్రాడ్యుయేషన్‌ (యూజీ)లో అప్రెంటిస్‌షిప్‌లతో ఒక అంశంలో వృత్తి నైపుణ్యం అందిస్తారు. నైపుణ్యం, స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రోగ్రామ్‌లు, కోర్సులు ఉంటాయి. పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్‌తో అనుసంధానమైన ఉపాధి కల్పన ప్రోగ్రామ్స్‌ను ప్రారంభిస్తారు. నైపుణ్య క్రెడిట్‌ ఫ్రేమ్‌వర్క్, సర్టిఫికేషన్‌ ఉంటుంది.



11 అంశాల్లో నైపుణ్యాలు

పాఠశాల స్థాయికి సంబంధించిన వృత్తి విద్య/ నైపుణ్య కోర్సులను 11 అంశాల్లో ఇవ్వాలని విద్యాశాఖ గుర్తించింది. ఇవి నాలుగు స్థాయిల్లో ఉండేలా కరిక్యులం రూపొందించనున్నారు. 

  • సాఫ్ట్‌ స్కిల్స్, ప్రాథమిక కమ్యూనికేషన్, ఆర్థిక, డిజిటల్‌ అక్షరాస్యత, ప్రొఫెషనల్‌ కమ్యూనికేషన్, పని ప్రాంతానికి సంసిద్ధత, కెరీర్‌ ప్లానింగ్‌-ఎదుగుదల, సమస్య పరిష్కారం-తార్కిక ఆలోచనపై నాలుగు స్థాయుల్లో శిక్షణ ఇస్తారు. 

  • నాయకత్వం-నిర్వహణ నైపుణ్యాలు, వినియోగదారుడి ఆధారమైన నైపుణ్యాలు, ఔత్సాహిక వ్యాపారవేత్త, వృత్తి నిర్దిష్టంగా నైపుణ్యాలు అందిస్తారు. 

  • సాఫ్ట్‌ స్కిల్స్‌లో మొదట దృక్పథం, ప్రవర్తన నైపుణ్యాలతో వ్యక్తిత్వ వికాసం నేర్పిస్తారు. ఆ తర్వాత వ్యక్తిత్వంలో మార్పు, తనను తాను తెలుసుకోవడం, ఒత్తిడి, భావోద్వేగం, ఆరోగ్య నిర్వహణతో జీవించడం, ఇతరులతో పరస్పర సంబంధాలపై శిక్షణ ఇస్తారు. ఇలా ఒక్కో వృత్తి విద్య/ నైపుణ్య కోర్సులపై శిక్షణ ఉంటుంది.






0 comments

Recent Posts

See All

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....

Comments


bottom of page