top of page

పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గారి సమావేశంలో ముఖ్యాంశాలు



పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గారి సమావేశంలో ముఖ్యాంశాలు

ఈరోజు జరిగిన గౌ|| డైరెక్టర్ గారి సమావేశంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ వి. విజయరామరాజు గారు, అదనపు డైరెక్టర్ శ్రీ ఎస్. సుబ్బారెడ్డి గారు, జాయింట్ డైరెక్టర్లు శ్రీ ఎస్. అబ్రహాం గారు మరియు శ్రీమతి శైలజ గారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చ జరిగింది. ముఖ్యాంశాలు ఇవే:

సమావేశ ముఖ్యాంశాలు:

  • రేషనలైజేషన్‌కు గురైన ఉపాధ్యాయులకు పాత స్టేషన్ పాయింట్లు లేక ప్రస్తుత స్టేషన్ పాయింట్లలో ఏదో ఒక ఎంపికను ఐఛ్ఛికంగా ఉపయోగించుకునే అవకాశం ఇవ్వనున్నారు.

  • ఈ నెల 24, 25, 26 తేదీల్లో మెడికల్ బోర్డు చురుకుగా పని చేసి సంబంధిత మెడికల్ సర్టిఫికెట్లు జారీ చేస్తుంది.

  • 610 జీవో ప్రకారం జిల్లా మారినవారిని, వారు ఎంపికైన DSC‌ను ప్రస్తుత జిల్లాలో చివరన కొనసాగిస్తారు.

  • 31 మే నాటికి రిటైర్మెంట్ అయ్యే ఉపాధ్యాయులకు ప్రమోషన్ ఇచ్చి, తర్వాత రిటైర్మెంట్ చేసేలా చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు.

  • సీనియార్టీ జాబితాలు అన్ని జిల్లాల్లో ఒకే విధంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

  • మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో PSHM‌లను హెచ్‌.ఎం.లుగా నియమిస్తారు. అవసరమైన పోస్టుల వివరాల ఆధారంగా వర్కింగ్ సర్‌ప్లస్ టీచర్లను నియమిస్తారు.

  • ఉన్నత పాఠశాలలో ప్రైమరీ సెక్షన్ ఏర్పాటు చేసే సందర్భంలో:

    • 1-10 విద్యార్థులు ఉంటే: 2 టీచర్లు

    • 11-30 వరకు: 3 టీచర్లు

    • 31-40 వరకు: 4 టీచర్లు

    • 45పైగా: మోడల్ స్కూల్‌గా పరిగణించి 5 టీచర్లు


      ఇదే విధానాన్ని బేసిక్ ప్రైమరీ స్కూల్‌లకు కూడా వర్తింపజేయాలని ప్రతిపాదించారు.

  • బదిలీల్లో కొన్ని పోస్టులను బ్లాక్ చేయకూడదని హామీ ఇచ్చారు.

  • ప్రైవేట్ బడుల్లో చదువుతున్న విద్యార్థులను ప్రభుత్వ మోడల్ స్కూల్‌లకు తీసుకురావడానికి కృషి చేయాలని సూచించారు.

  • స్కూల్ గణాంకాలు:

    • 1-10 తరగతుల స్కూల్స్: 1557

    • 6-10 తరగతుల స్కూల్స్: 4700

    • మోడల్ ప్రైమరీ స్కూల్స్: 9000+

    • బేసిక్ స్కూల్స్: 19000

    • ఫౌండేషనల్ స్కూల్స్: 5000 (సుమారు)

  • 700 UP స్కూల్స్‌ను ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నారు.

  • SGTల కోసం ఆన్లైన్ విధానంతో కూడిన మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని సూచించారు.

  • స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులకు RCI సర్టిఫికేట్ రీన్యూవల్‌కు సమయం ఇచ్చి సహాయం చేయాలని ప్రతినిధులు కోరారు.

  • AP మోడల్ స్కూల్ టీచర్లకు FRS, Salary, TIS కోసం ట్రెజరీ ID‌ను ఒకే పాస్‌వర్డ్‌తో ఉపయోగించే అవకాశం కల్పించాలని సూచించారు.

  • తెలుగు/హిందీకి అర్హులైన స్కూల్ అసిస్టెంట్లను సీనియార్టీ జాబితాలో చేర్చాలని కోరారు.

  • UPలలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

  • మైనర్ మీడియంలను కొనసాగించాలని సూచించారు.

  • ఖాళీగా ఉన్న Dy EO/MEO-1 పోస్టుల్లో కామన్ సీనియార్టీ ఉన్న హెచ్‌.ఎం.లకు FAC బాధ్యతలు ఇవ్వాలని కోరారు.

  • TISలో పొరపాట్లను సరిచేసుకోవడానికి డిడిఓ స్థాయిలో అవకాశం ఇవ్వాలని కోరగా, అది DEO స్థాయిలో మాత్రమే సాధ్యమని DSE తెలిపారు.

  • 220 వర్కింగ్ డేస్ తగ్గిన పాఠశాలలకు ఆదివారాల్లో పనిచేయాలన్న ప్రతిపాదన సరికాదని అభిప్రాయపడ్డారు.

  • 100 డేస్ ప్రోగ్రామ్‌లో ఇచ్చిన CCLను యాప్‌లో అప్‌లోడ్ చేయాలని కోరారు.


 
 
 

Comments


bottom of page