పాఠశాల విద్య కమిషనర్ గారితో సమావేశ వివరాలు
Updated: Jan 11
పాఠశాల విద్య కమిషనర్ గారితో సమావేశ వివరాలు


👉 వచ్చే విద్యా సంవత్సరంలో పాఠ్యపుస్తకాల భారం తగ్గించడానికి వీలుగా 1,2 తరగతులకు మొదటి సెమిస్టర్ కు అన్ని సబ్జెక్టులకు కలిపి 1 టెక్స్ట్ బుక్, 1 వర్క్ బుక్, రెండవ సెమిస్టర్ కు 1 టెక్స్ట్ బుక్, 1 వర్క్ బుక్ మాత్రమే ఉంటాయి. 3 - 5 తరగతులకు ఫస్ట్ సెమిస్టర్ కు లాంగ్వేజెస్ కు ఒక టెక్స్ట్ బుక్ ఒక వర్క్ బుక్, సబ్జెక్టులకు ఒక టెక్స్ట్ బుక్,ఒక వర్క్ బుక్ రూపొందించడం జరిగింది.
👉వచ్చే విద్యా సంవత్సరంలో 9,10 తరగతుల విద్యార్థులకు హిందీ పాఠ్యపుస్తకము ఎస్సీఈఆర్టీ రూపొందించిన పాత పుస్తకాన్ని అందిస్తారు.
👉సోషల్ తో పాటు వివిధ సబ్జెక్టులలో కొన్ని పాఠ్యాంశాలను తొలగించి అమలు చేస్తారు.
👉2026- 27 విద్యా సంవత్సరంలో అమలు చేయడానికి వీలుగా పాఠ్యపుస్తకాలపై సూచనలు సలహాలు కోరడం జరిగింది.
👉వివిధ తరగతులలో తగ్గించిన సిలబస్ పై జూన్ నెలలో ఓరియంటేషన్ క్లాసులు నిర్వహిస్తారు.
👉విద్యార్థులను అసెస్మెంట్ చేయుటకు నిర్వహించే పరీక్షలకు గాను సబ్జెక్టు వారిగా ఒక పుస్తకాన్ని అందిస్తారు.
👉ఎస్సీఈఆర్టీ ద్వారా టీచర్ మాడ్యూల్ రూపొందించి పాఠ్యాంశ బోధనకు అవసరమైన అదనపు సమాచారాన్ని అందిస్తారు.
👉ఓఎంఆర్ షీట్ ద్వారా పరీక్షలు నిర్వహించడం, వాటిని మూల్యాంకనం చేయడానికి మండల, జిల్లా స్థాయికి పంపడం కాకుండా క్యూఆర్ కోడ్ ద్వారా ఉపాధ్యాయుడే మూల్యాంకనం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
👉పాఠ్యపుస్తకాలలో ప్రతి పాఠ్యాంశానికి ముందు విద్యార్థుల నుండి రావాల్సిన ఔట్ కమ్స్ పొందుపరచడం జరుగుతుంది.
👉బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలు కొనసాగిస్తారు.
👉అకడమిక్ క్యాలెండర్ ను ఫిబ్రవరి నాటికి అందిస్తారు.
👉టిఐఎస్ నందు వివరాలను సంక్రాంతి సెలవులు పూర్తి అయ్యేలోపు అప్డేట్ చేయాలని కోరారు. ఈరోజుకు 94 వేల మంది ఉపాధ్యాయులు టిఐఎస్ పూర్తి చేశారు.
👉పదోన్నతుల కొరకు సీనియారిటీ జాబితాను డిజిటలైజ్ చేసి ఆన్లైన్లో ఉంచుతారు.
👉కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డిటెన్షన్ పాలసీపై అభిప్రాయాలు,సూచనలు తెలపాలని కోరారు.
👉117 జీవో రద్దు అనంతరం తీసుకువచ్చే జీవోపై నిన్న ఇచ్చిన ముసాయిదా నిబంధనల మేరకు కమిషనర్ గారు జనవరి 20వ తేదీ నుండి క్షేత్రస్థాయిలో అధికారులతో సమావేశం అవుతారు.
👉క్షేత్రస్థాయి నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా జనవరి నెల చివరి నాటికి జీవో విడుదల చేస్తారు.
👉అప్పటివరకు సూచనలు సలహాలు స్వీకరిస్తారు.
👉ప్రతి పంచాయతీలో ఒక ఆదర్శ ప్రాథమిక పాఠశాలను గ్రామ పంచాయతీ తీర్మానం ఆధారంగా ఏర్పాటు చేస్తారు. ఒక పంచాయతీలో 60 మంది పైగా విద్యార్థులు గల పాఠశాలలు ఒకటి కన్నా ఎక్కువ ఉన్నా దానిని కూడా ఆదర్శ ప్రాథమిక పాఠశాలగా నిర్వహిస్తారు.
👉తెలుగు సమాంతర మాధ్యమాన్ని కొనసాగించాలని కోరగా, ఇంగ్లీష్ మాధ్యమం మాత్రమే ఉంటుందని, ఈ సంవత్సరంతో పాటు రాబోయే ఒకటి రెండు సంవత్సరాలు తెలుగు మాధ్యమంలో కూడా పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
👉పురపాలక పాఠశాలల్లో కూడా తీసుకొచ్చే కొత్త జీవో ఆధారంగా పోస్టులను సర్దుబాటు చేస్తారు. అయితే పురపాలక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఎక్కువగా ఉన్నందున అదనంగా కావలసిన పోస్టులపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
👉75 మంది పైగా విద్యార్థులు గల ఉన్నత పాఠశాలకు హెచ్ఎం, పిడి పోస్టులను మంజూరు చేస్తామన్నారు. జిల్లాలో ఇంకా సర్ ప్లస్ గా ఉంటే డిసెండింగ్ ఆర్డర్లో సర్దుబాటు చేస్తారు.
👉అనాథరైజ్డ్ ఆబ్సెంట్ అయిన ఉపాధ్యాయులకు బదిలీలలో నెలకు ఒక పాయింట్ చొప్పున గరిష్టంగా 10 మైనస్ పాయింట్లు ఇవ్వడం జరుగుతుంది.
👉జనవరి చివరి నాటికి డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడవచ్చని, ఫిబ్రవరి మార్చి నెలలో బదిలీల చట్టం అసెంబ్లీలో చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.
👉సంక్రాంతి సెలవుల్లో ఎస్.ఎస్.సి యాక్షన్ ప్లాన్ లో విద్యార్థులకు సెల్ఫ్ ప్రిపరేషన్ తప్ప క్లాసుల నిర్వహణ లేదని, కానీ క్రింది స్థాయిలో సెలవులలో కూడా క్లాసులు నిర్వహించాలని వత్తిడి చేస్తున్న విషయంపై ప్రస్తావించగా విల్లింగ్ ఉంటే నిర్వహించండి తప్పనిసరి కాదని తెలిపారు.
👉పురపాలక ఉపాధ్యాయులకు ఇంటర్ మేనేజ్మెంట్, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు ఇంటర్ డిస్ట్రిక్ట్ బదిలీలు చేపట్టాలని కోరగా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేయాలని తెలిపారు.
👉బదిలీలలో పాయింట్ల కేటాయింపు, ప్రాధాన్యత కేటగిరి తదితర అంశాలపై చర్చించడం జరిగింది.
Recent Posts
See Allఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...
Comments