top of page
Writer's pictureAP Teachers TV

డీఎస్సీలో అవకాశం కల్పించాలి

Updated: Aug 10


ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వ్యాయామ విద్య దూరమవుతోంది. ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రవ్యాప్తంగా యూజీడీ పీఈటీ (అండర్‌ గ్రాడ్యుయేషన్‌ డిప్లొమో ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌) చేసిన నిరుద్యోగ పీఈటీ అభ్యర్థులకు అన్యాయం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి.

యూజీడీ పీఈటీ అభ్యర్థుల విన్నపం

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వ్యాయామ విద్య దూరమవుతోంది. ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రవ్యాప్తంగా యూజీడీ పీఈటీ (అండర్‌ గ్రాడ్యుయేషన్‌ డిప్లొమో ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌) చేసిన నిరుద్యోగ పీఈటీ అభ్యర్థులకు అన్యాయం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 2000 వరకు యూజీడీ పీఈటీ, డిగ్రీ తర్వాత బీపీఈడీ, ఆపై ఎంపీఈడీ చేసిన వారంతా ఉన్నత పాఠశాలల్లో పీఈటీలుగా నియమితులయ్యేవారు. ఆ తర్వాత ఫిజికల్‌ డైరెక్టర్‌ (పీడీ)గా ఉద్యోగోన్నతి పొందేవారు. 2004, 2010, 2012, 2016 డీఎస్సీలలో యూజీడీ పీఈటీ చేసిన వారంతా డీఎస్సీ రాశారు. గత వైకాపా ప్రభుత్వం తన హయాంలోని చివరి ఏడాదిలో ఆర్భాటంగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. అందులో కేవలం పీడీ (ఫిజికల్‌ డైరెక్టర్‌) పోస్టుల ఖాళీలనే చూపించింది. దీంతో వేల మంది యూజీడీ పీఈటీలు ఉపాధికి దూరమయ్యారు.



కొత్త ప్రభుత్వంపై ఆశలు

రాష్ట్రంలో సుమారు 15 పీఈటీ శిక్షణ కళాశాలలున్నాయి. ఒక్కో కళాశాలలో వంద మంది చొప్పున పదేళ్లలో సుమారు 15 వేల మంది శిక్షణ పొందిన వారున్నారు. అందులో దాదాపు 550 మంది పొరుగు సేవల ప్రాతిపదికన పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక డీఎస్సీ దస్త్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేశారు. 2024 మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఎస్‌ఎ (పీఈ) పేరుతో 1,691 పోస్టులు ప్రకటించినా ప్రస్తుత విధానంలో యూజీడీ పీఈటీ చేసిన అభ్యర్థులు డీఎస్సీకి అనర్హులవుతారు. పీఈటీ చేసిన వారికి కేవలం 132 ఖాళీలనే చూపించి సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ వెల్ఫేర్, గిరిజన విద్యాలయాల్లో భర్తీ చేయాలని నిర్ణయించారు.



పీఈటీల డిమాండ్లు ఇవీ..

  • ఉన్నత పాఠశాలల్లో పీడీలనే నేరుగా నియమించాలన్న నిబంధన ఉన్నందున 3 నుంచి 8వ తరగతి వరకు బోధించే ప్రాథమికోన్నత పాఠశాలల్లో పీఈటీలను నియమించాలి. తర్వాత అర్హత, ప్రతిభ ఆధారంగా పీడీలుగా ఉద్యోగోన్నతి ఇవ్వాలి.

  • రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 వేల ప్రాథమికోన్నత పాఠశాలలు నడుస్తున్నాయి. అందులో పీఈటీలను నియమించాలి.

  • 250 మంది విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలో పీడీ, 500 దాటితే పీడీ, పీఈటీ, వేయి వరకుంటే ఇద్దరు పీడీలు, ఇద్దరు పీఈటీలను నియమించాలి.




0 comments

Recent Posts

See All

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....

Comments


bottom of page