top of page

పీఆర్సీ పెండింగ్‌ అంశాలపై ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చ


employees unions leaders with ap ministers committee
apprc

పీఆర్సీ పెండింగ్‌ అంశాలపై ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చ

ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

ఉద్యోగులకు సంబంధించిన అన్ని అంశాలను సానుకూలంగా పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. బుధవారం వెలగపూడి సచివాలయంలో పీఆర్సీ పెండింగ్‌ అంశాలు, వాటిలో ఆర్థిక, ఆర్థికేతర అంశాలపై ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రుల కమిటీ సభ్యులైన సజ్జల, బొత్స సత్యనారాయణ చర్చించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ ఆర్థికేతర అంశాలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఉద్యోగుల హెల్త్‌ స్కీమ్‌ అమలులో సమస్యల పరిష్కారం, పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంపును సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాలతో పాటు పలు సంస్థల ఉద్యోగులకు వర్తింపచేయడం, కొత్త జిల్లాలకు పాత జిల్లాల హెచ్‌ఆర్‌ఏ వర్తింపు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, కోవిడ్‌ వల్ల మరణించిన ఉద్యోగుల కుటుంబీకులకు సత్వరమే కారుణ్య నియామకం, క్యాడర్‌వారీగా పే స్కేళ్ల ఫిక్సేషన్‌ జీవో జారీ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఆర్థిక అంశాలకు సంబంధించి పెండింగ్‌ బిల్లుల క్లియరెన్సు, పీఆర్సీ, డీఏ బకాయిల చెల్లింపు తదితర అంశాలపైనా చర్చించారు. ఈ సమావేశంలో జీఏడీ సర్వీసెస్‌ కార్యదర్శి హెచ్‌.అరుణ్‌కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) పి.చంద్రశేఖర్‌రెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకులు బండి శ్రీనివాసరావు, వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Comentarios


bottom of page