నన్ను విలన్ చేయొద్దు. MEO లకు సెలవుల మీద ఆంక్షలు పెట్టమని నేను చెప్పలేదు - వెట్రిసెల్వి

నన్ను విలన్ చేయొద్దు. MEO లకు సెలవుల మీద ఆంక్షలు పెట్టమని నేను చెప్పలేదు.సెలవుల విషయంలో G.ఓ follow కండి!-వెట్రి సెల్వి
ఏలూరు జిల్లా ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయులకు జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదికగా తెలియజేయు విషయములు..
ఈ రోజు NGO మరియు ఉద్యోగ సంఘాల JAC నాయకులు చైర్మన్ శ్రీ చోడగిరి శ్రీనివాస్ గారు,కార్యదర్శి నెరుసు రామారావుగారి ఆధ్వర్యాన యూటిఎఫ్ రవికుమార్ మరియు మిగిలిన ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఏలూరు జిల్లా గౌరవ కలక్టర్ వెట్రిసెల్వి ని కలసి టీచర్ల శెలవుల వినియోగంపై ఇటీవల MEO లు విధించిన 8% to 10% షరతులు,ఆంక్షలను ఆమెకు వివరించడం జరిగినది.దానికి వారు టీచర్ల శెలవుల విషయంలో నేను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు అపార్ విషయంలో మీరు త్వరితగతిన పూర్తి చేయండి అని మాత్రం చెప్పడం జరిగింది శెలవులపై GO ఎలా ఉందో దానిని ఫాలో అవ్వండి. నా పేరు చెప్పి టీచర్లకు శెలవులపై షరతులు పెట్టి నన్ను టీచర్లకు నన్ను విలన్ గా చూపించవద్దు నా పేరు చెప్పి టీచర్లకు శెలవులు ఇవ్వమని బెదిరించిన MEO లు ఎవరైనా ఉంటే వారు ఏ మండల MEOలు చెప్పండి వారిమీద యాక్షన్ తీసుకుంటానని చెప్పారు. ఈ సమావేశానికి గౌరవ జిల్లా విద్యాశాఖాధికారి కూడా హాజరైనారు.కలెక్టర్ ,DEO తో మాట్లాడుతూ మీరు ఇమీడియట్ గా MEO లతో VC పెట్టి టీచర్ల శెలవులపై ఎలాంటి షరతులు,ఆంక్షలు పెట్టకుండా MEO లకు ఇనస్ట్రక్షన్స్ ఇవ్వమని పాత పద్దతిలోనే GO NO 70 ఏమి చెబుతుందో దానికి శెలవుల మంజూరు చేసేలా చర్యలు గైకొనాలని DEO ని ఆదేశించారు. FLN లీడర్షిప్ ట్రైనింగ్ విషయమై కూడా JAC గా మట్లాడడం జిల్లా ప్రధాన కేంద్రంగా శిక్షణ నాన్ రెసిడెన్షియల్ ప్రాతిపదికన జరపాలని కోరగా ఈ శిక్షణాతరగతులు రాష్ట్ర SPD గారు అసైన్ చేసినది కాబట్టి మనం నిర్ణయం తీసుకొనుట కుదరదు కాని సంబంధిత రాష్ట్ర అధికారులతో మాట్లాడి పరిష్కారానికి ప్రయత్నిస్తానని చెప్పారు. కలక్టర్ ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సుహృద్భావ వాతావరణ లో చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం చూపి టీచర్ల మనసు గెలుచుకోవడమే కాక టీచర్లందరికీ తానొక స్నేహశీలిననే సందేశం వినిపించారు.ఈ సందర్భంగా JAC నాయకులందరూ ధన్యవాదాలు తెలిపారు.
Recent Posts
See Allఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...
Comments