నేడు జూలై 1 న టెట్ నోటిఫికేషన్
*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం*
*పాఠశాల విద్యాశాఖ*
ప్రెస్ నోట్ (30.06.2024)
*నేడు (జూలై 1న) ఏపీటెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల*
- జూలై 2 నుండి దరఖాస్తుల స్వీకరణ.
- - పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ ఎస్. సురేష్ కుమార్ గారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించాలని నిర్ణయించింది.ఈ నేపథ్యంలో అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు మరోసారి టెట్ నిర్వహించాలని నిర్ణయించింది.ఈ సందర్భంగా ఏపీటెట్ కొత్త నోటిఫికేషన్ జూలై1న విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.
AP TET (JULY)-2024 ఆన్లైన్ పరీక్షలకు సంబంధిన పూర్తి సమాచారం అనగా షెడ్యూల్, నోటిఫికెషన్స్, ఇన్ఫర్మేషన్ బులెటిన్,సిలబస్,ఆన్లైన్ విధానంలో (CBT) జరుగు పరీక్షలు గురించి అభ్యర్థులకు తగిన సూచనలు, విధివిధానాలు అన్నీ https://cse.ap.gov.in/ వెబ్ సైట్ నందు ఉంచబడినవి.అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం తేదీ.02.07.2024 నుండి పైన తెలిపిన వెబ్సైటు నుండి డౌన్లోడ్ చేసుకోగలరని తెలిపారు. సహాయ సమాచారం కోసం కమిషనర్ అఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను సంప్రదించాలని కోరారు.
*ఎస్.సురేష్ కుమార్*
కమీషనర్, పాఠశాల విద్యాశాఖ,
ఆంధ్ర ప్రదేశ్,అమరావతి.
Recent Posts
See Allనేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....
Comments