నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు
నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు
నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు. మంగళగిరిలోని పాఠశాల విద్య కమిషనరేట్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. గత రెండు వారాలుగా సంఘాల నేతలో చర్చలు జరిపిన డైరెక్టర్ పలు కీలక నిర్ణయాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. గత శుక్రవారం సంఘాల నేతలతో చర్చలు జరిపిన అనంతరం ఆరు సంవత్సరాలుగా ఎదురుచూస్తోన్న మున్సిపల్ టీచర్ల పదోన్నతులు, బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ తరుణంలోనే నేడు జరుగనున్న చర్చలలో తెలుగు మీడియం ఏర్పాటును ప్రస్తావించనున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం కేవలం ఇంగ్లీషు మీడియాన్నే ఉంచడంపై అపుడు ప్రతిపక్షంలో టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. దీంతో ఇపుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నేతలు తెలుగు భాషకు తగిన ప్రాధాన్యతనిస్తామని ఆది నుంచి చెబుతున్నారు.
మాతృభాషకు తప్పనిసరిగా ప్రాధాన్యత ఉంటుంది. ఇటీవల జరిగిన తెలుగు భాషా దినోత్సవాల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ు ప్రకటించారు. విద్యార్థులకు ఎంతో కీలకమైన పదవ తరగతి పరీక్షలలో వారి మార్కులపై భాష ప్రభావం పడకూడదని విద్యా వేత్తలు సైతం హెచ్చరిస్తున్నారు. కూటమి ముఖ్య నేతల నిర్ణయాలకు అనుగుణంగా ఇప్పటికే తెలుగు మీడియం ఏర్పాటుపై అధికారులకు ఇప్పటికే ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. కానీ ప్రకటనకు నోచుకోకపోవడంతో సందేహం నెల కొంది. నేడు పాఠశల డైరెక్టర్ జరుపనున్న చర్చలలో ఆప్షనల్ లాంగ్వే జ్స్ తెలుగు మీడియం ఏర్పాటుపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. జీవో 117 రద్దు, టీచర్ల పదోన్నతులు, బదిలీలపై ఇప్పటికే స్పష్టత ఇచ్చిన డైరెక్టర్ విజయరామరాజు తెలుగు మీడియం ఏర్పాటుపై కూడా నేడు ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా: సమావేశం 8వ తేదీకి వాయిదా పడిందని విశ్వసనీయ సమాచారం.
Komentarze