నీట్ లో అక్రమాలు నిజమే! రెండుచోట్ల వెలుగులోకి వచ్చాయి -కేంద్ర విద్యామంత్రి
నీట్ లో అక్రమాలు నిజమే..
రెండుచోట్ల వెలుగులోకి వచ్చాయన్న
-కేంద్ర విద్యామంత్రి
ఎన్టీఏ తీరు మారాలని వ్యాఖ్యనీట్‌లో.. దోషులను వదిలిపెట్టేది లేదని వెల్లడి
బీహార్‌లో పేపర్ లీక్ నేరాన్ని అంగీకరించిన ఇద్దరు నిందితులు
నీట్‌పై రెండు రోజుల దేశవ్యాప్త ఆందోళనకు విద్యార్థుల పిలుపు
‘నీట్’ ఓ స్కామ్ అన్న స్టాలిన్
అక్రమాల ఆరోపణలపై సుప్రీంకోర్టు కమిటీతో దర్యాప్తు జరిపించాలి
రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ డిమాండ్
న్యూఢిల్లీ/చెన్నై, జూన్ 16: నీట్ పరీక్షకు సంబంధించి రెండు చోట్ల అక్రమాలు వెలుగులోకి వచ్చాయని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంగీకరించారు. అయితే ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొన్నదని, విద్యార్థులు, తల్లిదండ్రులు భయపడొద్దని ఆయన ఆదివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ అన్నారు. సుప్రీంకోర్టు సూచన మేరకు 1,563 మంది విద్యార్థులకు తిరిగి పరీక్ష నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు.
జాతీయ స్థాయి పోటీ పరీక్షలు నిర్వహించే బాధ్యతలు కలిగిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)లో చాలా మెరుగుపడాల్సిన అవసరం ఉన్నదని కేంద్ర మంత్రి అన్నారు. ఎన్టీఏ ఉన్నతాధికారులైనా దోషులుగా తేలితే, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. గుజరాత్, బీహార్‌లలో నీట్ పరీక్షలో అక్రమాలపై వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆయా రాష్ర్టాల్లో పలువురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
సామాజిక న్యాయానికి వ్యతిరేకం
మెరిట్‌కు కొలమానమనే ముసుగులో ఉన్న నీట్ ఒక ‘స్కామ్’ అని తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఆరోపించారు. ఈ జాతీయ స్థాయి పరీక్ష విద్యార్థుల ప్రయోజనాలకు, సామాజిక న్యాయం, పేదలకు వ్యతిరేకంగా ఉన్నదని అన్నారు. నీట్ పరీక్షను సమర్థించుకోవడం ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు. ప్రస్తుతం నీట్ చుట్టూ రేగిన వివాదాలు దాని ప్రాథమిక అసమాన స్వభావాన్ని చూపుతున్నాయని స్టాలిన్ ఎక్స్ పోస్టులో అభిప్రాయపడ్డారు.
వేలాది సంవత్సరాల పాటు విద్య నిరాకరణకు గురైన సమాజంలో.. అణచివేతకు గురైన వారు ఉన్నతి సాధించేలా మరిన్ని అవకాశాలు ఇవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. అయితే అందుకు విరుద్ధంగా నీట్ అలాంటి విద్యార్థులకు అవకాశాలను నాశనం చేస్తున్నదని విమర్శించారు. కోట్లాది రూపాయలు లంచాలు తీసుకొని ఓఎంఆర్ షీట్లను ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలపై గుజరాత్ పోలీసులు ఇన్విజిలేటర్లపై కేసు నమోదు చేశారని తెలిపారు.
Recent Posts
See Allనేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....
Kommentarer