top of page
Writer's pictureAP Teachers TV

నీట్ పేపర్ లీకేజీపై సీబీఐ దూకుడు.. తొలి ఎఫ్ఐaఆర్ నమోదు #NEET_UG_Paper_Leak_Case

నీట్ పేపర్ లీకేజీపై సీబీఐ దూకుడు.. తొలి ఎఫ్ఐaఆర్ నమోదు #NEET_UG_Paper_Leak_Case



దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీకేజీ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. కేంద్రప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు లక్ష్యంగా చేసుకోవడంతో ఈకేసుపై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది. మరోవైపు యూజీసీ నెట్, నీట్ పరీక్షల పేపర్ లీకేజీలకు ప్రధాని మోదీ బాధ్యత వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. మోదీ ప్రభుత్వం మొత్తం విద్యావ్యవస్థను మాఫియాకు, అవినీతిపరులకు అప్పగించిందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఈక్రమంలో కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. దీంతో నీట్ పేపర్ లీకేజీపై సీబీఐ మొదటి ఎఫ్ఐఆర్‌ను నమోదు చేసింది. దర్యాప్తు బాధ్యతలు స్వీకరించిన రెండో రోజు సీబీఐ నీట్ పేపర్ లీకేజీ కేసుపై తొలి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. రానున్న రోజుల్లో ఈ పేపర్ లీకేజీ ఘటనలో మరింతమంది వ్యక్తులను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఉన్నతస్థాయి సమీక్ష తర్వాత..

నీట్ పేపర్ లీకేజీ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడంతో విద్యాశాఖ మంత్రిత్వశాఖ ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించింది. నీట్ పరీక్ష ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం కోల్పోకుండా ఉండేందుకు పేపర్ లీకేజీ ఘటనపై సీబీఐకి అప్పగించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా కేంద్రవిద్యాశాఖ అధికారులు తెలిపారు. పేపర్ లీకేజీ వ్యవహరంలో ఏదైనా వ్యక్తి, సంస్థ ప్రమేయం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే కేంద్రప్రభుత్వం హెచ్చరించిన విషయం తెలిసిందే.


ఎన్టీఏ చీఫ్‌ తొలగింపు

దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటన సంచలన రేపడంతో కేంద్రప్రభుత్వం ఎన్డీఏ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఆయన స్థానంలో సీనియర్ అధికారి ప్రదీప్ సింగ్ ఖరోలాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డీజీగా నియమించింది.





ఈ పోస్ట్ నచ్చితే కిందనున్న హృదయం గుర్తుపై నొక్కి సపోర్ట్ చేయగలరు. ధన్యవాదాలు


ap teachers tv telugu (apttv.co.in )


0 comments

Recent Posts

See All

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....

Comments


bottom of page