తక్షణమే 12వ వేతన సవరణ సంఘం నియమించి 30% ఐఆర్ ప్రకటించాలి -రాష్ట్ర ఫ్యాప్టో కార్యవర్గ తీర్మానం
తక్షణమే 12వ వేతన సవరణ సంఘం నియమించి 30% ఐఆర్ ప్రకటించాలి -రాష్ట్ర ఫ్యాప్టో కార్యవర్గ తీర్మానం.

ఈరోజు ఫ్యాప్టో చైర్మన్ ఎల్. సాయి శ్రీనివాస్ అధ్యక్షతన స్థానిక ఎన్టియు భవన్లో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం 12వ పిఆర్సీ కమీషన్ ను నియమించాలని, డిఎ బకాయిలు, పిఎఫ్, ఏపిజిఎల్ఐ బకాయిలు, సరెండర్ లీవ్ ఎన్ క్యాష్మాంట్ను చెల్లించాలని, అదే విధంగా పెరుగుతున్న ధరల నేపథ్యంలో 30% మధ్యంతర భృతిని ప్రకటించాలని, 11వ పిఆర్సీ బకాయిల కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారని ప్రభుత్వం ఆ ప్రయోజనాన్ని ఉద్యోగులకు కల్పించాలని ఫ్యాప్టో డిమాండ్ చేసింది.
పాఠశాల విద్య బలోపేతం కోసం ప్రభుత్వము 117 జీవో రద్దు కొరకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ప్రత్యామ్నాయ మార్గదర్శకాలలో పెద్ద ప్రయోజనాలు లేవని, వాటిని సవరించాలని, నాణ్యమైన విద్యా బోధన కొరకు విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తిని ఉన్నత పాఠశాలల్లో 1:30 గా పరిగణించి, 45 మంది విద్యార్థులు దాటిన చోట రెండవ సెక్షన్ ప్రారంభించాలని, ప్రాథమిక పాఠశాలలో 45 మంది విద్యార్థులు దాటిన వాటిని మోడల్ ప్రాథమిక పాఠశాలలుగా మార్చాలని, 30 నుండి 60 మంది విద్యార్థులు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలను అదే స్థాయిలో కొనసాగిస్తూ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు చేయాలని ఫ్యాప్టో డిమాండ్ చేసింది. అదే విధంగా ప్రభుత్వమే విద్యార్థులకు రవాణా వాహనాన్ని ఏర్పాటు చేయాలని ఫ్యాప్టో డిమాండ్ చేసింది. ఆర్ధిక ప్రయోజనాలు, పెండింగ్ డిమాండ్ల సాధనకై జెఎసితో కలిసి ఉద్యమించాలని ఫ్యాప్టో తీర్మానం చేసింది.
ఈ సమావేశంలో ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ యస్. చిరంజీవి, బి. మనోజ్ కుమార్ కో చైర్మన్, కె.భానుమూర్తి, డిప్యూటీ సెక్రటరీ జనరల్, సిహెచ్.సుబ్బారావు కోశాధికారి, ఎంఎస్. ఇమామ్ భాష, ఎం. బాబు రాజేంద్రప్రసాద్, కార్యవర్గ సభ్యులు కె.సురేష్ కుమార్, ముస్తాక్ పాల్గొన్నారు
Recent Posts
See Allఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...
Comments