వేసవిలో బదిలీలు, ప్రమోషన్లు
ఉపాధ్యాయ సంఘ నాయకులతో
విద్యాశాఖ కమిషనర్ గారు సమావేశంలో చర్చించిన అంశాలు:
రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగాఉన్న గ్రేడ్ 2 హెడ్మాస్టర్లు/స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు
చేపట్టాలని కోరగా 117 జీవో సవరించి వేసవి సెలవుల్లో బదిలీలు, ప్రమోషన్లు చేపడతామని తెలిపారు
2. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ప్రధానోత్సవానికి ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని కోరగా నవంబర్ మొదటి వారంలో నిర్వహిస్తామని తెలిపారు
3. 9,10వ తరగతి హిందీ పాఠ్యాంశాలను కొన్నింటిని వెంటనే తొలగించాలని పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు
4.పని సర్దుబాటులో 50 కిలోమీటర్ల కంటే దూరం వెళ్లడం జరిగిందని అలాంటి వారికి మినహాయింపు ఇవ్వాలని అలాంటి వారికి అనుకూలంగా ఏ స్కూల్ నుంచి అయినా టీచర్ మ్యూచువల్ గా వస్తాను అంటే వారిని ఆ పాఠశాలలకు పంపిస్తామని తెలిపారు
5.దసరా సెలవులను అక్టోబర్ 4 నుంచి కాకుండా మహాలయ అమావాస్య ప్రారంభం అక్టోబర్ 3 వ తేదీ నుంచి ఇవ్వాలని కోరగా పరిశీలిస్తామన్నారు.
6.స్కూల్ కాంప్లెక్స్ వల్ల రెండు పని దినాలు, SAMP వల్ల ఆరు పని దినాలు వృధా అవుతున్నాయని తెలపగా కుదిస్తామని తెలిపారు.
7. SSC పరీక్షలను రెండు మీడియం లలో నిర్వహించాలని కోరగా త్వరలో నిర్ణయం తెలుపుతామన్నారు.
8. TMF యాప్ లో ఇన్స్పెక్షన్ ఫామ్ ఇంకా అదనంగా చేర్చడం జరిగిందని తెలపగా చర్చించి నిర్వహణ తగ్గేలా చూస్తామని తెలిపారు.
9.స్కూల్ అటెండెన్స్ యాప్ లో మార్కుల uploading కష్టతరంగా మారిందని మునుపటి వలె ఉండాలని కోరగా పరిశీలిస్తామన్నారు.
10. పాఠశాల నిర్వహణ గ్రాంట్లు రెండు సంవత్సరాలుగా విడుదల చేయలేదని తెలపగా త్వరలోనే విడుదల చేస్తామన్నారు.
11. గతంలో డిజిటల్ లెసన్ ప్లాన్లు అనుమతించడం జరిగిందని అయితే ప్రస్తుతం పర్యవేక్షక అధికారులు వ్రాతపూర్వక లెసన్ ప్లాన్లు అడుగుతున్నారని తెలపగా ఈ విషయమై అధికారులతో చర్చిస్తామన్నారు.
12.డిఈఓ పూల్ లో పండితులకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరగా వేసవి సెలవుల్లో చేయడానికి ప్రయత్నిస్తామన్నారు.
ఇంకా అనేక విషయాలపై చాలా సమయం సమగ్రంగా చర్చించడం జరిగింది. కమిషనర్ విజయరామరాజు గారు సానుకూలంగా స్పందించి అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామని తెలిపారు.
Recent Posts
See Allనేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....
コメント