తెలంగాణలో పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ : OPS Restoration in Telangana
మళ్లీ ఓపీఎస్..?
• యోచిస్తోన్న తెలంగాణ రాష్ట్ర సర్కార్
• ఇప్పటికే ఐదురాష్ట్రాల్లో పునరుద్ధరణ
• ఉప ఎన్నిక తర్వాత నిర్ణయం
• ఉద్యోగ వర్గాల్లో ఎదురుచూపులు
ఉద్యోగ ఫ్రెండ్లీ సర్కార్గా పేరున్న తెలంగాణ ప్రభుత్వం పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ దిశగా యోచిస్తున్నట్లు తెలిసింది. తద్వారా ఖజానాకు భారం తగ్గడంతోపాటు ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం మరింత పెంపొందించి పాలనలో ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు కార్యాచరణ చేస్తోంది. ఇప్పటికే ఆర్ధిక శాఖ వివరాలను రెడీ చేసింది. పంజాబ్లో పాత పెన్షన్ విధానాన్ని అమలులోకి తేవడంతో తెలంగాణలో కూడా సీఎం కేసీఆర్ ఈ దిశగా యోచిస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. మునుగోడు ఉప ఎన్నికలు ముగిసిన అనంతరం ఈ అంశంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెప్పాయి. ఇప్పటికే పాత పెన్షన్ విధానం అమలు లోకి తెచ్చిన ఐదో రాష్ట్రంగా పంజాబ్ ఘనత సాధించగా ఆరో రాష్ట్రంగా తెలంగాణ నిలవనుందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్ ) ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీం(ఓపీఎస్)ను అమలు చేస్తామని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించి అమలు చేయడంతో తెలంగాణ ఉద్యోగుల్లో ఆశలు చిగురింపజేసింది. ఈ నేపథ్యంలో ఇక్కడి ఉద్యోగులకు సీపీఎస్ ను రద్దు చేయాలనే డిమాండ్ ఊపందుకుంటున్నది. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో 2004లో ఈ నూతన పెన్షన్ విధానం అమలులోకి వచ్చిన వెంటనే సీపీఎస్ ను ఉద్యోగులు వ్యతిరేకించారు. అయితే ఈ అంశం తమ పరిధిలో లేదని కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వం చెబుతూ వచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం సీపీఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను అమలు చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉందని చెబుతోంది. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలనుంచి భిన్నమైన ప్రకటనలు వస్తున్న తరుణంలోనే పంజాబ్ ఐదో రాష్ట్రంగా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించింది. దీంతో సీపీఎస్ రద్దు చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉందని ఈ ఐదు రాష్ట్రాలు రుజువు చేశాయి. కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసేలా ఉన్న నూతన పెన్షన్ విధానంపై మొదటినుంచీ వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. 1.72లక్షల మంది ఉద్యోగులకు నష్టం కల్గిస్తున్న సీపీఎస్ ను రద్దు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.
వీడియో చూడండి
Recent Posts
See Allనేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....
Comments