top of page
Writer's pictureAP Teachers TV

డాక్యుమెంట్, పీడీఎఫ్ ల నుండి వాటర్ మార్క్ ఎలా తీసేయాలి?



వాట్సాప్ లో వచ్చే లెస్సన్ ప్లాన్స్, యాన్యువల్ ప్లాన్స్, జీవోలు వంటి ఫైల్స్ వాడుకుందాం అనుకుంటాం.అవసరానికి ఇంటర్నెట్ నుండి డౌన్ లోడ్ చేసుకుంటాం. కానీ వాటిలో ఎవరిపేరో, వెబ్ సైట్ పేరో,లోగోనో వాటర్ మార్క్ గా ఉంటుంది.అలాంటప్పుడు ఆ Google Doc,MS Word, పీడీఎఫ్ లపై వాటర్ మార్క్ లను పూర్తిగా పర్ఫెక్ట్ గా ఎలా తీసేయాలి? మనం ఏదైనా డాక్యుమెంట్ ఫైల్ కి వాటర్ మార్క్ గానీ లోగో గానీ యాడ్ చేయాలంటే ఏంచేయాలి? వీటన్నిటికీ ఈ చిన్న వీడియోలో సులువైన మార్గం చూపించడం జరిగింది. ఈరోజుల్లో ప్రతీ ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయిని తెలివిగా డిజిటల్ ఆన్ లైన్ సోర్స్ ని ఉపయోగించుకుంటున్నారు.తమ సమయాన్ని,శ్రమని తగ్గించుకుంటూ డిజిటల్ సోర్స్ వాడకంతో ప్రభావవంతంగా బోధిస్తూ పిల్లలు, తోటి గురువులు,అధికారుల మెప్పు పొందుతున్నారు. నిండైన వృత్తిగత సంతృప్తి (Professional Satisfaction) పొందుతున్నారు.ఈ నేపథ్యంలో క్లాస్ రూమ్ డిజిటల్ వైట్ బోర్డ్ సాఫ్ట్ వేర్, ఏనిమేషన్ వీడియోల తయారీ సాఫ్ట్ వేర్, 3D, AR(జంతువులు, వస్తువులను క్లాస్ రూమ్ లో రియల్ గా ప్రత్యక్షం చేసే ఆగ్మెంటెడ్ రియాలిటీ) వీడియోలతోపాటు ఉపాధ్యాయుల వర్క్ లోడ్ తగ్గించే ఎన్నో మొబైల్ యాప్స్,సాఫ్ట్ వేర్ లను పరిచయం చేయబోతున్నాం తదుపరి వీడియోలలో! వీటిని మిస్ కాకుండా ఉండేందుకు ఇప్పుడే మన ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్ కి సబ్ స్క్రైబ్ చేసుకోండి. టీచర్స్ వర్గానికి రికమెండ్ చేయండి. వివిధ రకాల డాక్యుమెంట్ ఫైల్స్ నుంచి వాటర్ మార్క్ తొలగించే వీడియో కింద చూడవచ్చు. ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోలరాకను ప్రోత్సహించగలరు.


కింద టచ్ చేసి వీడియో చూడండి.



షేర్ చేసి మీ ప్రోత్సాహం అందించండి

1 comment

Recent Posts

See All

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....

1 Comment


kbchandrudu99
Jul 17, 2022

Very very

Like
bottom of page