top of page
Writer's pictureAP Teachers TV

డాక్టర్ ఘనత! తాను కనిపెట్టిన వైద్యంతో తన బ్రెయిన్‌ కేన్సర్‌ని జయించాడు! #cancertreatment

డాక్టర్ ఘనత! తాను కనిపెట్టిన వైద్యంతో తన బ్రెయిన్‌ కేన్సర్‌ని జయించాడు! #cancertreatment



కేన్సర్‌ అంటేనే.. ఎలాంటి వాళ్లు అయినా ఒక్కసారిగా ఉలిక్కిపడతారు. ఏ స్టేజ్‌లో ఉందో? నయం అవుతుందో? లేదా? అన్న భయాలు మొదలైపోతుంటాయి. ఎంతటి వాడినైనా కుదేలయ్యిపోయేలా చేస్తుంది. అలాంటి కేన్సర్‌ మహ్మమ్మారిని తను కనిపెట్టిన వైద్య విధానంతో స్వీయ చికిత్స తీసుకుని జయించి చరిత్ర సృష్టించాడు ఓ వైద్యుడు. తన జీవితాన్ని పొడిగించుకున్నందకు సంబరపడిపోతున్నాడు.



ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ప్రముఖ ఆస్ట్రేలియా వైద్యుడు ప్రొఫెసర్‌ రిచర్డ్‌ స్కోలియర్‌ బ్రెయిన్‌ కేన్సర్‌ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో నిర్థారణ అయ్యింది. అప్పుడు ఆయనకు 57 ఏళ్లు. నిజానికి ఈ వ్యాధి వచ్చిన వాళ్లు 12 నెలలకు మించి బతకరు. దీంతో ఈ వ్యాధిపై అవగాహన ఉన్న రిచర్డ్‌ ..తన  స్నేహితుడు ప్రొఫెసర్‌ జార్జినా లాంగ్‌ సాయంతో కొత్త చికిత్సా విధానాన్ని అభివృద్ధి చేశారు. దాన్ని తనపైనే ప్రయోగం చేసుకున్నాడు రిచర్డ్‌. 



ఈ చికిత్స విధానం సర్జరీ రహితం. ఆశ్చర్యకరంగా ఆ చికిత్స బాగా పనిచేసి మెదడులోని కణుతులన్నీ మాయమైపోయాయి. తాజాగా ఎమ్మారై తీయగా కణితులు కనిపించకపోవడంతో రిచర్డ్‌ ఆనందం వ్యక్తం చేశారు. తానిప్పుడు చెప్పలేనంత భావోద్వేగానికి గురవ్వుతున్నానని అన్నారు. తన జీవితకాలాన్ని పొడిగించుకున్నాని, తన భార్య, పిల్లలతో కలిసి మరికొంత కాలం కలిసి జీవించే అవకాశం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు రిచర్డ్‌. 

ఈ చికిత్స విధానం సుమారు మూడు లక్షల మందికి ఉపయోగపడుతుందని చెప్పారు. సర్జరీ లేకుండా చేసే ఈ "ఇమ్యూనో థెరపీ' పెద్ద సంఖ్యలో ఉపయోగడుతుందని ధీమాగా చెబుతున్నారు. అంతేగాక ఈ చికిత్సలో మరిన్ని విప్లవాత్మక మార్పులు తెచ్చి మరింతగా అభివృద్ధి చేయడమే గాక విస్తృతమైన క్లినకల్‌ ట్రయల్స్‌ నిర్వహించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉందని జార్జిన్‌ లాంగ్‌ అన్నారు. 

ఇవి కూడా చదవండి 👇




0 comments

Recent Posts

See All

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....

Commentaires


bottom of page