డీఏ ప్రకటన చేసిన ఏపీ ప్రభుత్వం.
Updated: Nov 26, 2022
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు DA విడుదల ప్రకటన చేసింది. వచ్చే 2023 జనవరి నుంచి ఒక డీఏ విడుదలకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అంగీకరించారనిప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ మరియు వెంకటరామిరెడ్డి ప్రకటన చేశారు. పీఆర్‌సీలో నష్టపోయిన ఉద్యోగులు ఎంతోకాలంగా డీఏ కోసం ఎదురుచూస్తున్నారు. ఆందోళనలో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగులకు ఈ వార్త పెద్దగా సంతోషించదగ్గది కాకపోయినా గుడ్డిలో మెల్ల నయం అన్నట్లు ఎంతో కొంత ఆర్ధిక ప్రయోజనం కలిగించేదిగా కాస్త ఉపశమనం కలిగించే వార్తగా చెప్పుకోవచ్చు . 2023 జనవరి నుంచి ఒక డీఏ విడుదల చేస్తే మిగతావి ఎప్పుడు విడుదల చేస్తారు అన్న ఆందోళనలో సందేహాస్పదంగా ఉన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గం.
ఉద్యోగులకు జనవరిలో డీఏ
ఏప్రిల్లో సచివాలయ ఉద్యోగుల బదిలీలు
గ్రేడ్-3 సర్వేయర్లకు గ్రేడ్-2గా పదోన్నతి
సీఎం జగన్ భరోసా
ప్రభు త్వ ఉద్యోగులకు జనవరిలో ఒక డీఏను విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి వెల్లడించారు. అదే విధంగా గ్రామ, వార్డు సచివాల యాల్లో పనిచేస్తున్న గ్రేడ్-3 సర్వేయర్లను గ్రేడ్-2గా మార్పు. చేయాలని నిర్ణయించారు. ఈ విషయమై ఆంధ్ర ప్రదేశ్ గవర్న మెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (ఏపీజీఈఎఫ్) ఆధ్వర్యంలో శుక్ర వారం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్యోగ నేతలు మర్యాద పూర్వకంగా కలిశారు. ఉద్యోగుల కు రావలసిన డీఏలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేయగా ముఖ్య మంత్రి సానుకూలంగా స్పందించి వచ్చే ఏడాది జనవరి నుంచి ఒక డీఏ మంజూరు చేస్తామని చెప్పా రు. గ్రామ వార్డు సచివాలయాల లో పనిచేస్తున్న గ్రేడ్ -3 సర్వేయ ర్లను గ్రేడ్-2 గా మారుస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కి గ్రామ సర్వేయర్ల తరుపున ఏపీజీ ఈ ఎఫ్
చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా గ్రామ, వార్డు ' సచివాలయాలలో పని చేస్తున్న గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులకు చిన్న పంచాయతీల పూర్తి భాద్యతలు కేటాయించే ప్రతిపాదనకు సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. సెప్టెంబర్ లో జరగవలసిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు వాయిదాపడినట్లు వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. వీలైనంత త్వరగా బదిలీలు జరిపించాలని కోరారు. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ ఏప్రిల్ లో బదిలీలకు అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ సర్వే ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ, గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు కిషోర్, భవనం వెంకట రామిరెడ్డి, కావ్య దీప్తి తదితరులు పాల్గొన్నారు.
Comments