డీఎస్సీ-98 టీచర్లు బడికి వెళ్లాలా వద్దా?
డీఎస్సీ-98 టీచర్లు బడికి వెళ్లాలా వద్దా?
గందరగోళంగా డీఎస్సీ-98 టీచర్ల పరిస్థితి
బడికి వెళ్లాలా? వద్దా? అనే ఆందోళనలో వారున్నారు. డీఎస్సీ-98 టీచర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పాఠశాలలు ఈనెల 12నుంచి పునఃప్రారంభమయ్యాయి. నిబంధనల ప్రకారం పాఠశాల తెరి చిన రోజునే వెళ్లాల్సి ఉన్నా... విద్యాశాఖ ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. ఉపాధ్యాయుల బదిలీల్లో వీరు పని చేస్తున్న పోస్టులను ఖాళీగా చూపడంతో చాలాచోట్ల రెగ్యులర్ వాళ్లు వచ్చి చేరిపోయారు. ఇప్పుడు ఆ బడికి వెళ్లాలో.. లేదో సమాధానం చెప్పేవారు లేరు.
కొందరు మండల విద్యాధికారులు తర్వాత చెబుతామని, మరికొందరు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత రావా లని సూచిస్తున్నారు. విశాఖపట్నంలో ఎస్జీటీల బదిలీలకు సంబంధించిన ఉత్త ర్వులను ఆలస్యంగా ఇచ్చారు. కొత్త పాఠశాలల్లో చేరేందుకు ఉపాధ్యాయులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. డీఎస్సీ- 98కు చెందిన 4,072 మందిని ఏప్రిల్ 12న తీసుకోగా.. వీరిలో 16 మంది ఆ నెల చివరికే, మేలో 256 మంది పదవీ విర మణ చేశారు. ఈ నెలాఖరుకు మరో 400 మంది పదవీ విరమణ చేయను న్నారు. వేసవి సెలవుల ముందు కాంట్రాక్టు సర్వీసు పూర్తయినా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వకపోవడంతో వీరి పరిస్థితి సందిగ్ధంలో ఉంది.
తాజా వార్త:
1998 డిఎస్ సి మినిమమ్ టైంస్కేల్ ఉపాధ్యాయులకు 2,3 రోజులలో ఉత్తర్వులు ఇస్తారు. 2008, 1998 డిఎస్ సి మినిమం టైంస్కేల్ వారిద్దరికి త్వరలో కౌన్సిలింగ్ నిర్వహించి బ్లాక్ చేసిన ఎస్ జిటి ఖాళీలలో నియమిస్తారు.
Recent Posts
See Allనేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....
Comments