టమాటా పప్పు.. కోడిగుడ్డు కూర.. పోలింగ్ సిబ్బందికి మెనూ ఇదే!
టమాటా పప్పు.. కోడిగుడ్డు కూర.. పోలింగ్ సిబ్బందికి మెనూ ఇదే!
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి సమతుల ఆహారం అందించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది
ఎండల తీవ్రత పెరిగింది. ఈ తరుణంలో పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం తప్పనిసరి. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి సమతుల ఆహారం అందించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ముందుగా సిబ్బంది ఈ నెల 12న ఎన్నికల సామగ్రితో వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు సమోసా, మజ్జిగ, 5 గంటలకు మజ్జిగ లేదా నిమ్మరసం అందిస్తారు. రాత్రి 7 నుంచి 8 గంటల మధ్యలో భోజనం (అన్నం, కూర, చపాతీ, టమాటా పప్పు, పెరుగు, చట్నీ) అందిస్తారు.
పోలింగ్ రోజు 13న ఉదయం 6 గంటలకు టీ, రెండు అరటి పండ్లు, 8 నుంచి 9 మధ్య క్యారట్, టమాటాతో కూడిన ఉప్మా, పల్లీల చట్నీ, 11, 12 గంటల సమయంలో మజ్జిగ పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం (కోడిగుడ్డు కూర, ఓ కూరగాయ, చట్నీ, సాంబారు, పెరుగు) అందిస్తారు. మధ్యాహ్నం 3, 4 గంటల సమయాల్లో మజ్జిగ లేదా నిమ్మరసం పంపిణీ చేస్తారు. 5.30కి టీ, బిస్కెట్లు అందిస్తారు. ఈ ప్రక్రియ గ్రామాల్లో పంచాయతీ అధికారుల, పురపాలికల్లో ప్రత్యేకంగా నియామకమైన వారు పర్యవేక్షించేలా కార్యాచరణ రూపొందించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఫ్యాన్లు, అవసరమైతే కూలర్లు ఏర్పాటు చేయనున్నారు.
Recent Posts
See Allనేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....
Comments