top of page
Writer's pictureAP Teachers TV

టెన్త్‌ పరీక్షల ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోండి #10thResults2024#SSCResults2024

టెన్త్‌ పరీక్షల ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోండి #10thResults2024 #SSCResults2024


టెన్త్‌ పరీక్షల ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోండి:

AP SSC Results 2024.. ఏపీలో టెన్త్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఏపీ విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ విడుదల చేశారు. 6.23 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో బాలికలదే పైచేయి సాధించారు.

బాలుర ఉత్తీర్ణత శాతం: 84.32

బాలికల ఉత్తీర్ణత శాతం: 89.17


ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు వచ్చేశాయ్‌. సోమవారం ఉదయం విజయవాడలో టెన్త్‌ ఫలితాలను విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ విడుదల చేశారు. రికార్డుస్థాయిలో తక్కువ రోజుల వ్యవధిలోనే పరీక్షలు విడుదల చేస్తున్నట్లు తెలిపారాయన.

పదో తరగతి పబ్లిక్‌ పరీక్ష ఫలితా.లను విద్యార్థులకు ఒక్క క్లిక్‌దూరంలో విద్యార్థులకు సాక్షి అందుబాటులోకి తెస్తోంది. https://results.bse.ap.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా వేగంగా విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు.

ఇదిలా ఉండగా, మార్చి నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు విద్యాశాఖ కమిషనర్‌a తెలిపారు. వీరిలో రెగ్యులర్‌ విద్యార్థులు 6.23 లక్షలు కాగా, గత ఏడాది ఫెయిల్‌ అయిన విద్యార్థులు లక్షకుపైగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3473 పరీక్షా కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు నిర్వహించారు. ఈ సంవత్సరం టెన్త్‌ పత్రాల మూల్యాంకనం రికార్డు స్థాయిలో వేగంగా పూర్తి చేసినట్లు, విద్యా సంవత్సరం ముగియక ముందే ఫలితాలు ప్రకటిస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ కమిషనర్‌ తెలిపారు.



ఇంకా ఆయన ఏమన్నారంటే..

6.23 లక్షల మంది విద్యార్థుల టెన్త్‌ పరీక్షలు పరీక్షలు రాశారు

టెన్త్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయి

బాలుర ఉత్తీర్ణత శాతం 84.32, బాలికల ఉత్తీర్ణత శాతం 89.17

మొత్తంగా 86.69 శాతం మంది విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యారు

ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా టాప్‌.. 93.7 శాతం రిజల్ట్‌

ఫలితాల్లో చివరి స్థానంలో కర్నూలు జిల్లా (67 శాతం)

2,300 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత

ఒక్కరూ పాస్‌కాని స్కూల్స్‌ 17

మే 24 నుంచి జూన్‌ 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు

కింది లింకుల ద్వారా పదోతరగతి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు



పూర్తి వివరాలు

1.ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు మార్చి 2024 పత్రికా ప్రకటన,

2.ముఖ్యాంశాలు,

3.ఇతర గణాంకాలు,

4.నమోదైన మరియు హాజరైన అభ్యర్థులు హాజరు శాతం,

5.బాల బాలికల వారీగా ఉత్తీర్ణత శాతం,

6.సబ్జెక్టు వారీగా ఉత్తీర్ణత శాతం,

7.మీడియం వారీగా హాజరైన ఉత్తీర్ణులైన అభ్యర్థులు మరియు ఉత్తీర్ణత శాతం,

8. 0% నుంచి 100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు,

9.మేనేజ్మెంట్ వారీగా పాఠశాలల నుండి హాజరైన ఉత్తీర్ణులైన అభ్యర్థులు మరియు ఉత్తీర్ణత శాతం,

10.జిల్లాల వారీగా హాజరైన ఉత్తీర్ణులైన బాలబాలికలు వివరాలు,

11.జిల్లాల వారీగా వివిధ శ్రేణుల్లో ఉత్తీర్ణులైన వారు,

12. అభ్యర్థులకు ముఖ్యమైన సమాచారం,

13.రీకౌంటింగ్ & రివెరిఫికేషన్ పై సూచనలు,

14.మైగ్రేషన్ సర్టిఫికెట్ వివరాల కోసం కింది పూర్తి వివరాలు బటన్ నొక్కండి


పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదల లైవ్ వీడియో




0 comments

Comments


bottom of page