top of page
Writer's pictureAP Teachers TV

టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టోలో ఉద్యోగులకు తీపికబురు! #APElections2024


టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టోలో ఉద్యోగులకు తీపికబురు! #APElections2024 #tdpjanasenamanifesto

Andhrapradesh: టీడీపీ - జనసేన - బీజేపీ మేనిఫెస్టో విడుదలైంది. మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలతో కలిసి మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. బీజేపీ దేశ స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేసిందన్నారు. టీడీపీ - జనసేన కసరత్తు చేసి మేనిఫెస్టో రూపకల్పన చేశామని చెప్పుకొచ్చారు. ప్రజలను గెలిపించేందుకే తమ కలయిక అని స్పష్టం చేశారు.


అమరావతి, ఏప్రిల్ 30: టీడీపీ - జనసేన - బీజేపీ మేనిఫెస్టో (TDP-Janasena-BJP Manifesto) విడుదలైంది. మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu), జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Jenasena Chief Pawan Kalyan), బీజేపీ ముఖ్య నేతలతో కలిసి మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. బీజేపీ (BJP) దేశ స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేసిందన్నారు. టీడీపీ - జనసేన కసరత్తు చేసి మేనిఫెస్టో రూపకల్పన చేశామని చెప్పుకొచ్చారు. ప్రజలను గెలిపించేందుకే తమ కలయిక అని స్పష్టం చేశారు.

పూర్తి మానిఫెస్టో కోసం ఇక్కడ నొక్కండి


ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకే తాము సర్దుబాటు చేసుకున్నామని చంద్రబాబు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉద్యోగులు చాలా నష్టపోయారన్నారు. ఉపాధ్యాయులను మద్యం షాపుల వద్ద నిలబెట్టారన్నారు. ఉద్యోగులకు వచ్చే బెనిఫిట్స్ ఏం ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఉద్యోగుల్లో ఆత్మ విశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచుతామని తెలిపారు. పీఆర్సీ ప్రకటిస్తామని.. ఆలోగా ఇంటెరిమ్ రిలీఫ్ ఇస్తామని ప్రకటించారు. సీపీఎస్ రద్దు సమస్యపై కసరత్తు చేసి పరిష్కరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.


మేనిఫెస్టోలో ముఖ్య అంశాలు...

  • 20 లక్షల మంది యువతకు ఉపాధి.

  • నెలకు రూ. 3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి.

  • మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం.

  • మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.

  • తల్లికి వందనం ఒక్కో బిడ్డకు రూ. 15 వేలు.

  • స్కిల్ గణన చేపడతాం.

  • ఎంఎస్ఎంఈలకు ప్రొత్సాహాకాలు.

  • 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తాం.

  • మెగా డీఎస్సీ మీదే తొలి సంతకం.

  • ఆడపిల్లల విద్యకు కలలకు రెక్కలు పథకం.. వడ్డీ లేని రుణాలిస్తాం.

  • అన్న క్యాంటీన్లు, పండుగ కానుకలు ఇస్తాం.

  • వలంటీర్లకు రూ. 10 వేలు జీతం.

  • ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల నుంచి కాపులకు దామాషా పద్దతిన రిజర్వేషన్లు అమలు చేస్తాం.

  • అగ్ర వర్ణ పేదలకు న్యాయం చేస్తాం.

  • ఇప్పటికే మంజూరైన ఇళ్ల పట్టాల్లో ఇళ్లు కట్టిస్తాం.

  • విజయవాడలో హజ్ హౌస్. పూర్తి మేనిఫెస్టో కోసం ఇక్కడ నొక్కండి



0 comments

Recent Posts

See All

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....

Comments


bottom of page