టీచర్ల సర్వీసు రికార్డుల నవీకరణకు 3 అవకాశాలు
- AP Teachers TV
- Dec 20, 2024
- 1 min read

అమరావతి: ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి టీచర్ల సర్వీసు వివరాల నవీ కరణకు శనివారం నుంచి అవకాశం కల్పించను న్నారు. బదిలీలు, పదోన్నతులను వేసవి సెల వుల్లో నిర్వహించనున్నారు. ఇందుకోసం మూడు పర్యాయాలు టీచర్ల సర్వీసు వివరాల నవీకరణ చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ప్రక టించారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులతో గురువారం నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. పదోన్నతుల కోసం సీని యారిటీ జాబితాను డీఈఓలు విడుదల చేసి, మూడు పర్యాయాలు సరి చేసుకునే అవకాశం కల్పిస్తారు. బదిలీలకు గతంలో ఉన్నట్లే నాలుగు కేటగిరీలు ఉంటాయి. వీటి ఆధారంగా స్టేషన్ పాయింట్లు ఇస్తారు.
ఉన్నత పాఠశాలల్లో 75 మంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉంటే ప్రధానో పాధ్యాయుడు, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులనుమంజూరు చేస్తారు. ప్రాథమికోన్నత పాఠశాలలో 6, 7, 8 తరగతుల్లో 60మందికి పైగా విద్యా ర్థులు ఉంటే ఉన్నత పాఠశాలగా ఉన్నతీకరి స్తారు. 31 నుంచి 60 మంది విద్యార్థులున్న ప్రాథమికోన్నత పాఠశాలకు మూడు కి.మీ.లోపు ఉన్నత పాఠశాల అందుబాటులో లేకపోతే అక్కడ కొనసాగిస్తారు. బేసిక్ ప్రాథమిక పాఠశా లలో ప్రస్తుతం ఉన్న నిబంధనల మేరకు 20 మంది విద్యార్థులకు ఒక టీచర్, 21-60 వరకు ఇద్దరు, 61-90 వరకు ముగ్గురు చొప్పున ఉపా ధ్యాయులను కేటాయిస్తారు. జీఓ 117 రద్దు అనంతరం మెమో రూపంలో నిబంధనలు విడు దల చేసి, విద్యార్థులు, పాఠశాలల సంఖ్య, తల్లి దండ్రుల కమిటీ తీర్మానం తీసుకున్న తర్వాత తుది జీఓ విడుదల చేస్తారు. క్లస్టర్ పాఠశాలల పైన అభ్యంతరాలు స్వీకరించి, రెండో జాబితా విడుదల చేస్తారు.
Comments