టీచర్ల బదిలీలు, పదోన్నతులు సందడి మొదలు ! Teachers Transfers and Promotions
ఉపాధ్యాయ సంఘాల నేతలతో పాఠశాల డైరెక్టర్ సమావేశం Teachers Transfers and Promotions

అమరావతి:ఉపాధ్యాయుల బదిలీలు,పదోన్నతులు వేసవి సెలవుల్లో చేపట్టడానికి వీలుగా వివరాలు అప్డేట్ చేయనున్నట్లు పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు తెలిపారు.
అందుబాటులో లేకపోతే అక్కడ ప్రాథమికోన్నత పాఠశాలను కొనసాగిస్తారు. శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్లో 1:30 ప్రకారం ఉపాధ్యాయులను నియమించనున్నారు. బేసిక్ ప్రైమరీ స్కూల్ నందు ప్రస్తుతం ఉన్న నిబంధనల మేరకు 20 మంది విద్యార్థుల వరకు ఒకరు, 21 నుండి 60 వరకు ఇద్దరు, 61 నుంచి 90 వరకు ముగ్గురు చొప్పున ఉపాధ్యాయులను కేటాయిస్తారు. 117 జీవోరద్దు అనంతరం ఇవ్వబోయే నిబంధనలను మెమో రూపంలో విడుదల చేసి ప్రస్తుత విద్యార్థుల సంఖ్య, పాఠశాలల సంఖ్య, పేరెంట్స్ కమిటీ తీర్మానం అన్నీ తీసుకున్న తర్వాత తుది జీవో విడుదల చేయనున్నారు. క్లస్టర్ పాఠశాలలను ఎంఈఓ లు పంపిన ప్రతిపాదనల మేరకు జాబితా విడుదల చేశామని, దీనిలో అభ్యం తరాలను స్వీకరించి తర్వాత రెండో జాబితా విడుదల చేస్తామని, అందరికీ ఆమోదయోగ్యమైన తర్వాత తుది క్లస్టర్ పాఠశాలల జాబితా విడుదల చేస్తామని సంఘాల నేతలకు తెలిపారు.
అర్హత గల ఎస్జీటీలకు బీపీఈడి కోర్సు చేయడానికి అన్ని అంశాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. డీఎస్సీ ద్వారా నియమించే వారిని మూడు నాలుగు కేటగిరీలో మాత్రమే నియమిస్తామన్నారు. వైద్య కారణాలపై ప్రాధాన్యతకేటగిరి ఉపాధ్యాయుల మెడికల్ సర్టిఫికెట్లు జిల్లా మెడికల్ బోర్డు ద్వారా జనవరి నుండి ఇప్పించే ప్రయత్నం చేస్తామన్నారు. ప్రధానో పాధ్యా యుల పని భారం తగ్గించడానికి సిఆర్పీల ద్వారా సమాచారాన్ని పంపించే ఏర్పాటు చేస్తామన్నారు.గురువారం తాడేపల్లిలోని సీఎస్ఈ కార్యాలయంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. బదిలీల కొరకు రెండు లేదా మూడు రోజుల్లో టీచర్ ప్రొఫైల్ అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. మూడుసార్లు ప్రొఫైల్ అప్డేట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు పదోన్నతుల కొరకు సీనియారిటీ జాబితాను డిఇవోలు ద్వారా విడుదల చేసి మూడుసార్లు అప్డేట్ చేసుకునే అవకాశం కల్పిస్తారు రీఅపోర్షన్మెంట్ ద్వారా బదిలీ అయ్యే వారికి 8 సంవత్స రాలకు మించకుండా పాయింట్లు కేటా యిస్తారు. బదిలీలలో గతంలో నిబంధనల వలె 1,2,3,4 కేటగిరీలుగా పరిగణించి స్టేషన్ పాయింట్లు ఇవ్వడం జరుగుతుంది. ఉన్నత పాఠశాలల్లో 75 మంది విద్యార్థులు దాటినచోట హెచ్ఎం, పిడి పోస్టు లను మంజూరు చేస్తారు. పిడి పోస్టులు అదనంగా ఉంటే 75 మంది లోపు విద్యార్థులకు డిసెండింగ్ ఆర్డర్ లో ఇస్తారు. ప్రాథమికోన్నత తరగతులలో 60 మంది పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలను ఉన్నత పాఠశాలగా ఉన్నతీకరిసా మన్నారు. 31-60 మంది విద్యార్థులు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలకు మూడు కిలోమీటర్ల లోపు ఉన్నత పాఠశాలలు.
Recent Posts
See Allఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...
Comments