top of page

జియో కొత్త యాప్‌.. స్మార్ట్‌ టీవీ చిటికెలో కంప్యూటర్‌గా! Jio Cloud PC app


Jio Cloud PC: జియో కొత్త యాప్‌ను తీసుకొస్తోంది. ఒక్క యాప్‌ సాయంతో మీ స్మార్ట్‌ టీవీని కంప్యూటర్‌లా మార్చుకోవచ్చని చెబుతోంది.

Jio Cloud PC app
Jio Cloud PC app

Jio Cloud PC | దిల్లీ: రిలయన్స్‌ జియో (Jio) మరో కొత్త సంచలనానికి సిద్ధమైంది. ఒక్క యాప్‌ సాయంతో స్మార్ట్‌ టీవిని కంప్యూటర్‌లా మార్చుకునే సౌకర్యాన్ని రూపొందించింది. ఈ టెక్నాలజీని ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ - 2024 ఈవెంట్‌లో ప్రదర్శించింది. జియో క్లౌడ్‌ పీసీగా (Jio Cloud PC) పిలిచే ఈ సాంకేతికతో కొన్ని వందల రూపాయలతోనే మీ స్మార్ట్‌ టీవీని కంప్యూటర్‌గా మార్చుకోవచ్చని కంపెనీ తెలిపింది.

ఇంటర్నెట్‌ సౌకర్యం, కీబోర్డు, మౌస్‌, స్మార్ట్‌టీవీ ఉంటే చాలు.. జియో క్లౌడ్‌ పీసీ యాప్‌ ఉపయోగించి టీవీని కంప్యూటర్‌లా మార్చుకోవచ్చని జియో పేర్కొంది. యాప్‌లో లాగిన్‌ అయ్యి కంప్యూటర్‌ తరహాలోనే ఈ-మెయిల్స్‌, మెసేజింగ్‌, సోషల్‌ మీడియా, ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌ వంటివి చేసుకోవచ్చు. ఈ డేటా మొత్తం క్లౌడ్‌లో స్టోర్‌ అవుతుంది. మధ్యతరగతి కుటుంబానికి కంప్యూటర్‌ కొనుగోలు భారం కాకూడదన్న ఉద్దేశంతో ఈ కొత్త సాంకేతికను తీసుకొచ్చినట్లు జియో తెలిపింది.



జియో క్లౌడ్‌ పీసీతో స్మార్ట్‌ టీవీ, కంప్యూటర్‌ రెండు వేర్వేరు డివైజులు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదని టీమ్‌ పేర్కొంది. సాధారణ టీవీలను జియో ఫైబర్‌/ జియో ఎయిర్‌ఫైబర్‌ సెట్ టాప్‌ బాక్స్‌ అమర్చడం ద్వారా స్మార్ట్‌గా మార్చుకోవచ్చని పేర్కొంది. మొబైల్‌లో సైతం ఈ కొత్త సర్వీసును వాడుకోవచ్చని తెలిపింది. అయితే, ఈ యాప్‌ను ఎప్పుడు విడుదల చేసేది? ఎంత ధర ఉంటుందనే వివరాలు వెల్లడించలేదు. 





 
 
 

Comments


bottom of page