top of page

చైనా ‘డీప్‌సీక్‌’ ఎఫెక్ట్‌.. ఓపెన్‌ఏఐ ‘డీప్‌ రీసెర్చ్‌’ : OpenAI vs Deepseek

Writer's picture: AP Teachers TVAP Teachers TV

ChatGPT Vs Deepseek
ChatGPT Vs Deepseek

OpenAI: చైనా ‘డీప్‌సీక్‌’ నుంచి పోటీ పెరుగుతున్న నేపథ్యంలో ఓపెన్‌ఏఐ ‘డీప్‌ రీసెర్చ్‌’ పేరుతో కొత్త టూల్‌ను ఆవిష్కరించింది.

కృత్రిమ మేధ రంగంలో పెను సంచలనం సృష్టించిన చైనా ‘డీప్‌సీక్‌’.. దిగ్గజ ఏఐ సంస్థలకు సవాళ్లు విసురుతోంది. ఈనేపథ్యంలోనే అమెరికా టెక్‌ సంస్థ ‘ఓపెన్‌ ఏఐ (OpenAI)’ కీలక ప్రకటన చేసింది. ‘డీప్‌ రీసెర్చ్‌ (Deep Research)’ పేరుతో కొత్త టూల్‌ను ఆవిష్కరించింది. మనిషి చాలా గంటల్లో చేసే పనిని ఈ కొత్త టూల్‌ పది నిమిషాల్లోనే చేసి పెడుతుందని కంపెనీ వెల్లడించింది.

‘‘ఓపెన్‌ ఏఐ తదుపరి ఏజెంట్‌ డీప్‌ రీసెర్చ్‌ స్వతంత్రంగా పని చేయగలదు. మీరు ప్రాంప్ట్‌ ఇస్తే.. చాట్‌జీపీటీ (ChatGPT)నే వందలాది ఆన్‌లైన్‌ సోర్సులను విశ్లేషించి.. రీసెర్చ్‌ అనలిస్ట్‌ స్థాయిలో సమగ్ర నివేదిక రూపొందిస్తుంది’’ అని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. టోక్యోలో ఉన్నతస్థాయి సమావేశానికి ముందు కంపెనీ ఈ టూల్‌ను ఆవిష్కరించింది.



ఓపెన్‌ఏఐ చీఫ్‌ శామ్‌ ఆల్ట్‌మన్‌ ప్రస్తుతం టోక్యోలో ఉన్నారు. జపాన్‌ ప్రధాని షిగెరు ఇషిబా, టెక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్‌ గ్రూప్‌ అధినేత మసయోషి సన్‌తో ఆయన చర్చలు జరపనున్నారు. ఓపెన్‌ఏఐ, సాఫ్ట్‌బ్యాంక్‌, ఒరాకిల్‌ కలిసి ‘స్టార్‌గేట్‌’ పేరుతో సంయుక్త ప్రాజెక్టును ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ కృత్రిమ మేధలో 500 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనుందని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు.

ఇదిలాఉండగా.. చైనా (China)కు చెందిన ‘డీప్‌సీక్‌ (DeepSeek)’ ఇటీవల అమెరికా టెక్‌ స్టాక్స్‌ను కుదిపేసిన సంగతి తెలిసిందే. హాంగ్జౌకు చెందిన ఈ ఏఐ రీసెర్చ్‌ సంస్థ.. కొన్ని రోజుల కిందట ఆర్‌1 పేరిట ఏఐ మోడల్‌ను ఆవిష్కరించింది. ఇది పూర్తిగా ఉచితం. ఓపెన్‌ఏఐ, క్లాడ్‌ సోనెట్‌ వంటి సంస్థలు ఇందుకోసం సబ్‌స్క్రిప్షన్‌ రూపంలో కొంత మొత్తాన్ని వసూలుచేస్తున్నాయి. ఈనేపథ్యంలో పూర్తి అడ్వాన్స్‌ ఏఐ మోడల్‌ను ఇలా పూర్తిగా ఉచితంగా అందిస్తుండడంతో డీప్‌సీక్‌ పేరు నెట్టింట మార్మోగింది. అంతేకాదు.. టెస్ట్‌ ఏఐ మోడళ్ల తయారీ కోసం ఓపెన్‌ఏఐ, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి సంస్థలు బిలియన్ల కొద్దీ డాలర్లు వెచ్చిస్తున్న వేళ.. డీప్‌సీక్‌ మాత్రం కేవలం 6 మిలియన్‌ డాలర్లతో లేటెస్ట్‌ ఏఐ మోడల్‌ను రూపొందించడం గమనార్హం.




 
 

Recent Posts

See All

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...

Comments


bottom of page